కావలసినవి :
బాస్మతి బియ్యం : 2 కప్పులు
ఉల్లిపాయ : 1 తరిగినది
అల్లం,వెల్లుల్లి పేస్ట్ : 2 టీస్పూన్లు
పచ్చిమిర్చి : 2 కాయలు నిలువుగా చీల్చుకోవాలి
క్యారెట్ : 1 ముక్కలుగా చేసుకోవాలి
పచ్చి బటానీలు : ముప్పావు కప్పు
నీళ్ళ : 3 కప్పులు
జీలకర్ర : 1 స్పూను
నూనె : 3 స్పూన్లు
గరం మసాలా ( ఎలకులు-3, దాల్చిన చెక్క-1, లవంగాలు-4, బిర్యానీ ఆకు-1)
ఉప్పు : తగినంత
తయారు చేయువిధానం : :వెడల్పాటి పాన్లో నూనె వేసి వేడెక్కిన తరువాత జీలకర్ర, గరం మసాలా వేయాలి. 1 నిమిషం వేగిన తరువాత ఉల్లిముక్కలు, తరిగిన పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి పేస్ట్, వేసి తరువాత కూరగాయల ముక్కలు వేయాలి. ఒకటి రెండు నిమిషాల తరువాత నానబెట్టిన బియ్యం వడకట్టి ఇందులో కలపాలి. మూత పెట్టి అన్నం ఉడికిన తరువాత దించుకోవాలి.