కావలసినవి :
పుట్టకొక్కులు : అరకిలొ
బాస్మతి బియ్యం : 2 కప్పులు
ఉల్లిపాయ : 1 పెద్దది (తరుగుకోవాలి)
టమాటోలు : 2 చిన్న ముక్కలుగా కోయాలి
అల్లం, వెల్లుల్లి పేస్ట్ : 2 టీ స్పూన్లు
కొతిమీర : పావు కప్పు తరిగినది
పొదీన : పావు కప్పు తరిగినది
పచ్చి మిర్చి : 3 కాయలు నిలువుగా సన్నగా చీల్చినవి
నెయ్యి : 3 స్పూన్లు
నూనె : 3 స్పూన్లు
కొబ్బరి పాలు : అర కప్పు నీళ్ళు : 3 కప్పులు
పెరుగు 2 టీ స్పూన్లు
ఉప్పు : తగినంత
కారం : 2 టీ స్పూన్లు
జిలకర్ర పొడి : 1 టీస్పూన్
పసుపు : పావు స్పూన్
గరమ్ మసాలా : కొద్దిగా (బిర్యాని ఆకు-1, దాల్చినచెక్క-2, లవంగాలు-5, ఎలకులు-3)
తయారు చేయువిధానం : పుట్టకొక్కులను శుభ్రం చేసుకొని మురికి నంతా తొలగించాలి. కడగకుండా కిచెన్ టవల్ కు రుద్దితే మురికి పోతుంది. పెద్దగా ఉంటే ముక్కలు చేసుకోవచ్చు. బాస్మతి బియ్యాన్ని అరగంట సేపు నానపెట్టుకోవాలి. అడుగు మందం గల పాన్లో నూనె నెయ్య వేసి వేడెక్కిన తరువాత గరం మసాలా వేసి వేయించాలి. తరువాత ఉల్లిముక్కలు వేసి మంచి కలర్ వచ్చేదాకా వేయించాలి తరువాత తరిగిన పచ్చిమిర్చి, కొతిమీర, పొదీనా ఆకులను వేసి వేయించాలి. తరువాత అల్లం, వెల్లుల్లి పేస్ట్, టమాటోలు వేసి పచ్చి వాసన పోయేదాకా 2, 3 నిమిషాలు వేయించాలి. తరువాత పుట్టకొక్కులను వేయాలి. తరువాత పసుపు, కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, కొబ్బరి పాలు, ఉప్పు వేసి కొంచెం చిక్కబడే దాకా ఉడికించాలి. తరువాత వడకట్టిన బియ్యం,నీరు,కొంచెం ఉప్పు వేసి అన్నం ఉడికేదాకా ఉంచి దించుకోవాలి. కొతిమేర చల్లుకోవచ్చు.