📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

చికెన్ బిరియాని

కావలసినవి :
బాస్మతీ బియ్యం : 2 కప్పులు (ముందుగా కడిగి అరగంటసేపు నానబెట్టుకోవాలి)
చికెన్ : అర కిలో
ఉల్లిపాయ : ఒకటి పెద్దది (చిన్నవి 2)
టమాటోలు : రెండు (ముక్కలుగా తరగాలి)
అల్ల, వెల్లుల్లి పేస్ట్ : 1 టీస్పూన్
కొతిమీర : పావు కప్పు తరిగినది
పొదినా : పావుకప్పు తరిగినది
పచ్చి మిరపకాయలు : 5 సన్నగా నిలువుగా చీల్చినవి
నూనె : 3 టీ స్పూన్లు
నెయ్యి : 3 టీస్పూన్లు
పెరుగు : పావు కప్పు
నీళ్ళు : నాలుగున్నర కప్పులు
ఉప్పు : తగినంత
కారం : 2 టీ స్పూన్లు
జిలకర్ర పౌడర్ : 1 టీస్పూను
పసుపు : పావు స్పూను
చికెన్ కు పట్టించే మషాల కోసం :
ఉప్పు : పావు స్పూను
నిమ్మరం, పెరుగు : 2 స్పూన్లు
పసుపు : పావు స్పూను
ధనియాల పౌడర్: 1 టీస్పూను
గరం మసాలా : 1 టీ స్పూను
మిరియాల పౌడర్ : అర స్పూను
కారం : 1 స్పూను
అల్లం వెల్లుల్లి పేస్ట్ : 1 స్పూను
గరమ్ మసాలా కోసం
బిర్యానీ ఆకులు : 2
దాల్చిన చెక్క : 4 ముక్కలు
ఏలకులు : 3
లవంగాలు : 5
జాపత్రి : 2
తయారు చేయువిధానం : చికెన్ శుభ్రం చేసికొని చిన్న ముక్కలుగా కోయాలి. చికెన్ కు పట్టించే మషాల దినుసులను మెత్తగా గ్రైండ్ చేసి చికెన్ కు పట్టించి ఒక గంట సేపు రెఫ్రిజరేటర్ లో ఉంచాలి.
బియ్యంను కడిగి 15 ని. పాటు నానపెట్టి వడపోయాలి. అడుగు మందంగా గల వెడల్పాటి పాత్రలో నూనె, నెయ్యు వేసి వేడి చేయాలి. గరం మసాలాలో చెప్పిన వస్తువులు మీ ఇష్టాన్ని బట్టి అలాగే కానీ లేక మొత్తం పొడిగా చేసి కాని వేయాలి . తరువాత తరిగిన ఉల్లిపాయలు, పచ్చి మిర్చి వేయాలి. ఉల్లిపాయలు కొద్దిగా కలర్ వచ్చేదాకా వేయించి తరిగిన కొత్తిమీర, పొదీనా ఆకులు వేసి కలపాలి. తరువాత తరిగిన టమాటో ముక్కలు కలపాలి. తరువాత ఫ్రిజ్లో ఉంచిన చికెన్, పసుపు,కారం, జిలకర్ర పౌడర్, పెరుగు, ఉప్పు వేసి 5 నుండి 10 ని.ల సేపు ఉంచి నానబెట్టిన బియ్యం కలిపి మొత్తం ఉడికే దాకా ఉంచి దించుకోవాలి.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading