📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Thai Noodles / థాయ్ నూడుల్స్

కావలసినవి
నూడుల్స్ ప్యాకెట్ – ఒకటి
నువ్వులనూనె – రెండు టేబుల్స్పూన్లు
ఉల్లికాడల తరుగు – అరకప్పు క్యారెట్ తరుగు – కప్పు
క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు చొప్పున
వెల్లుల్లి తరుగు – మూడు టేబుల్స్పూన్లు
అల్లం తరుగు –అరచెంచా
తేనె – చెంచా
పీనట్బటర్ – పావుకప్పు
సోయాసాస్ – టేబుల్స్పూను
వెనిగర్ – టేబుల్స్పూను
చిల్లీగార్లిక్ సాస్ – ఒకటిన్నర చెంచా
ఉప్పు – తగినంత
తయారు చేసే విధానం
ఓ గిన్నెలో సగం వరకూ నీళ్లూ, కొద్దిగా ఉప్పూ, అరచెంచా నూనె తీసుకుని పొయ్యిమీద పెట్టాలి. అవి మరిగాక నూడుల్స్ వేయాలి. ఐదారు నిమిషాలకు అవి ఉడుకుతాయి. అప్పుడు దింపేసి వెంటనే చల్లని నీటిలో వేసి తరవాత వడకట్టాలి. ఈ నూడుల్స్పై కాస్త నూనె వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యిమీద బాణలి పెట్టి మిగిలిన నూనె వేయాలి. అది వేడయ్యాక వెల్లుల్లి తరుగూ, అల్లం తరుగూ, ఉల్లికాడల తరుగూ, క్యారెట్ తరుగూ, క్యాప్సికం, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. నాలుగు నిమిషాలయ్యాక తేనె, పీనట్బటర్, సోయాసాస్, వెనిగర్, చిల్లీగార్లిక్ సాస్, వేసి బాగా కలపాలి. కూరగాయ ముక్కలన్నీ కాస్త వేగాయనుకున్నాక నూడుల్స్ వేసి బాగా కలుపుకోవాలి. వీటికి మసాలా బాగా పట్టాక దింపేస్తే చాలు.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading