📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

శృంగేరి – భక్తులకు ఒక పవిత్ర పట్టణం

శృంగేరి శారదాపీఠం రాజగోపురం

మొదట శృంగేరి అని పేరు ఎలా వచ్చిందో చూద్దాం.

ఋష్యశృంగ + గిరి -> శృంగ + గిరి -> శృంగేరి.

ఋష్యశృంగ ఒక మహర్షి. వారు ఎవరో తెలుసా? రామాయణంలో దశరథ మహారాజు ఆస్థానంలో పుత్రకామేష్టి యజ్ఞం చేసినవారు. దీని మూలంగానే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు జన్మిస్తారు. ఋష్యశృంగుడు ఇక్కడే ఉండేవారు, అందుకే స్థల పేరు శృంగేరి..

హిందూమత జగద్గురువు ఆది శంకరాచార్య తుంగనది ఒడ్డునకల ప్రశాంత పట్టణం శృంగేరి లో మొదటి మఠాన్ని స్ధాపించారు. అప్పటినుండి శృంగేరి ఒక యాత్రా స్ధలంగా వేలాది భక్తులు సంవత్సరం పొడవునా సందర్శిస్తూనే ఉన్నారు. 

వారు మన సనాతన ధర్మాన్ని ప్రచారం చేయడానికి భారతదేశంలో నాలుగు దిశలలో నాలుగు మఠాలను స్థాపించాలనుకున్నారు.

తుంగ నది ఒడ్డున పర్యటించే సమయంలో ఆయన ఒక నాగుపాము తన పడగను విప్పి మండుటెండనుండి ఒక కప్పను కాపాడటం ఆయన దర్శించారు. తన శత్రువైన కప్పకు ఆ నాగుపాము చేసిన దయనీయ చర్య శంకరాచార్యులను ఆశ్చర్య పరచింది. ఆ ప్రదేశం ఎంతో విశిష్టతగల ప్రదేశంగా ఆయన గుర్తించారు. నేడు శృంగేరి పట్టణం ఆయన స్ధాపించిన శారదా పీఠం కలిగి ప్రతిరోజూ వేలాది భక్తులను ఆకర్షిస్తోంది.   శృంగేరి లో ఇంకా చూడదగిన ప్రదేశాలు అంటే విద్యాశంకర్ మరియు శారదాంబ దేవాలయాలు. విద్యా శంకర్ దేవాలయం దాని 12 స్తంభాలకు ప్రసిద్ధి. వీటిని 12 రాశుల గుర్తులుగా చెపుతారు. ఈ దేవాలయాన్ని ఖగోళ సిద్ధాంతాలమేరకు నిర్మించారు.

అందువల్ల అతను ఇక్కడ మొదటి మఠం స్థాపించాలని నిర్ణయించుకున్నాడు. వారు శారదా పీఠాన్ని ఇక్కడే స్థాపించారు. ఈ మఠం ఇప్పుడు దక్షిణామ్నాయ శ్రీ శారదా పీఠం అని ప్రసిద్ధి పొందింది. తుంగ నది తీరంలో ఈ మఠం ఉంది.

శృంగేరి పట్టణ ఇతిహాస, పురాణ పూర్వాపరాలు – శృంగేరి పట్టణం ఒక వనరుల సమృధ్ధికల, పచ్చటి ప్రదేశం. ఇది కర్నాటకలోని చిక్కమగళూరు జిల్లాలో ఉంది. ఆది శంకరాచార్యులు శృంగేరి పట్టణానికి వచ్చినపుడు ఆ పట్టణంలో ఎంతో విశేషత ఆయనకు గోచరించటంతో తన మొదటి మఠాన్ని అక్కడ నిర్మించారు.

శ్రీ శారదా ఆలయం.

శ్రీ శారదా దేవి.

ఇదే తుంగ నది.

చేపలు చాలా ఉంటాయి ఈ నదిలో.

కన్నడలో ఒక మాటు ఉంది ‘గంగ స్నాన తుంగ పాన’ అని. తుంగ నది నీళ్లు అంత మంచిది. అంటే గంగలో ఒక సారి స్నానం చేయాలి మరియు ఒక సారి తుంగ నీళ్లు తాగాలి.

ఇప్పుడు విద్యాశంకర దేవాలయం గురించి చూద్దాం.

శ్రీ విద్యాశంకర దేవాలయం

శ్రీ విద్యాశంకర

విద్యాశంకర ఆలయం క్రీ.శ 1338 లో నిర్మించబడింది. ఇది పూర్తిగా ఒకే రాతితో నిర్మించిన ఒక ప్రత్యేకమైన ఆలయం, ఇది హొయసల మరియు ద్రావిడ నిర్మాణ శైలుల సమ్మేళనం.

పడమటి వైపు గర్భగృహం ఉంది, ఒక వైపు విద్యా గణపతి, మరోవైపు దుర్గ దేవి ఉన్నాయి. గర్భగృహం యొక్క ఇతర మూడు వైపులలో బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరులకు చిన్న గర్భగృహాలు ఉన్నాయి. తూర్పు వైపులో పన్నెండు స్తంభాలతో ఒక మంటపం ఉంది. ఈ పన్నెండు స్తంభాలు రాశిచక్రం యొక్క పన్నెండు సంకేతాలను వాటి క్రమంలో చూపిస్తాయి. ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు పడగానే అందులోని ప్రత్యేక స్థంభం దానికి సంబంధించిన నెలను, సంవత్సరాన్ని చూపిస్తుంది.

శ్రీ విద్యాశంకర దేవాలయం మరియు శ్రీ శారదా ఆలయం పక్క పక్కనే ఉంటాయి.

తుంగా నది కూడా దగ్గరగా ఉంటుంది.

శృంగేరి పక్షి నోట

ఆలయం మరియు గురు నివాసాన్ని కలిపే వంతెన ఒకటి ఉంది.

నదికి అవతలి వైపు మనకు గురు నివాసం ఉంది.

సంస్కృత తరగతులు, గురుకుల, వేద తరగతులు అక్కడ జరుగుతాయి.

శారదా పరమేశ్వరి

అది జగద్గురు శంకరాచార్యులు.

ప్రస్తుత శృంగేరి గురువులు.

భారత దేశంలో శృంగేరి మఠంలో మాత్రమే అవిచ్ఛిన్న గురుపరంపర ఉంది. వేరే ఎక్కడ కూడా లేదు.

గురువుల పేర్లు:

  1. ఆది శంకరాచార్యులు ( – 820)
  2. సురేశ్వరాచార్యులు (820-834)
  3. నిత్యభోధఘన (834-848)
  4. జ్ఞానఘన (848-910)
  5. జ్ఞానోత్తమ (910-954 )
  6. జ్ఞానగిరి (954-1038)
  7. సింహగిరి (1038-1098 )
  8. ఈశ్వర తీర్థ (1098-1146)
  9. నృసింహ తీర్థ (1146-1229 )
  10. విద్యాశంకర తీర్థ (1229-1333)
  11. భారతీకృష్ణ తీర్థ (1333-1380)
  12. విద్యారణ్య (1380-1386 )
  13. చంద్రశేఖర భారతి I (1386-1389 )
  14. నృసింహ భారతి I (1389-1408 )
  15. పురుషోత్తమ భారతి I (1408-1448 )
  16. శంకర భారతి (1448-1455 )
  17. చంద్రశేఖర భారతి II (1455-1464 )
  18. నృసింహ భారతి II (1464-1479 )
  19. పురుషోత్తమ భారతి II (1479-1517 )
  20. రామచంద్ర భారతి (1517-1560 )
  21. నృసింహ భారతి III (1560-1573 )
  22. నృసింహ భారతి IV (1573-1576 )
  23. నృసింహ భారతి V (1576-1600 )
  24. అభినవ నృసింహ భారతి (1600-1623 )
  25. సచ్చిదానంద భారతి I (1623-1663 )
  26. నృసింహ భారతి VI (1663-1706 )
  27. సచ్చిదానంద భారతి II (1706-1741 )
  28. అభినవ సచ్చిదానంద భారతి I (1741-1767)
  29. నృసింహ భారతి VII (1767-1770 )
  30. సచ్చిదానంద భారతి III (1770-1814)
  31. అభినవ సచ్చిదానంద భారతి II (1814-1817 )
  32. నృసింహ భారతి VIII (1817-1879 )
  33. సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి (1879-1912 )
  34. చంద్రశేఖర భారతి III (1912-1954 )
  35. అభినవ విద్యాతీర్థ (1954-1989 )
  36. భారతీ తీర్థ (1989-ప్రస్తుతం)
  37. విధుశేఖర(2015-ప్రస్తుతం)
 

శృంగేరి వాతావరణం సంవత్సరం పొడవునా ఆహ్లాదంగా ఉంటుంది. శృంగేరి పట్టణానికి మంగుళూరు సమీప విమానాశ్రయం. శృంగేరి పట్టణం బెంగుళూరుకు 330 కి.మీ. దూరంలో ఉండి, సౌకర్యవంతమైన బస్ సర్వీస్ కలిగి ఉంది. దీనికి సమీప రైల్వే స్టేషన్లు, షిమోగా మరియు కడూర్ లు.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading