📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Ainavilli Siddhi Vinayaka Temple (అయినవిల్లి సిద్ధి వినాయకస్వామి ఆలయం) in India

Ainavilli Siddhi Vinayaka Temple
English
తెలుగు

Ainavilli Siddhi Vinayaka Temple

Ainavilli, Newstoday: The temple of Siddhi Vinayaka Swamy at Ainavilli in Dr. B.R. Ambedkar Konaseema District is widely known as a divine place that fulfills devotees’ wishes. Here, Lord Vinayaka faces south and blesses devotees. It is believed that offering a coconut with devotion and remembering one’s wish will lead to its fulfillment, and later, on revisiting, devotees repay their vows.

Situated near the sacred Gautami Godavari River, this ancient temple shines with spiritual glory. According to temple lore, Sage Vyasa, during his journey across South India, installed Lord Vinayaka here. Daksha Prajapati is also believed to have worshipped Siddhi Vinayaka at this shrine before successfully completing his yagna at Draksharamam without obstacles. Elders say the temple was built by divine beings themselves.

Daily special abhishekams with coconuts, and Lakshmi Ganapati homams are performed. Thousands of devotees visit regularly. The temple is especially popular for ceremonies like Aksharabhyasam (initiation into learning), Annaprasana (first rice feeding), and naming ceremonies. Each year, the deity is bathed with water from seven holy rivers, and a lakh of pens are placed at the Lord’s feet and later distributed freely to students after special worship, blessing them for success in examinations.

During Vinayaka Chavithi, nine days of Navaratri celebrations are held in a grand manner. The deity blesses devotees in procession on his mouse vehicle across temple streets. Free annaprasadam is served to pilgrims arriving from distant places. Nearby, the Tirumala Tirupati Devasthanams (TTD) has also constructed a comfortable guesthouse for devotees.

అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయం

అయినవిల్లి, న్యూస్టుడే: భక్తుల కోరికలు నెరవేర్చే దైవంగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం అయినవిల్లి సిద్ధి వినాయకస్వామి ఆలయం. డా. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లిలోని ఈ ఆలయంలో స్వామివారు దక్షిణాభిముఖంగా భక్తులను అనుగ్రహిస్తారు. స్వామివారికి ఒక నారికేళం సమర్పించి సంకల్పం స్మరించి దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని, ఆ తర్వాత పునర్దర్శనానికి వచ్చినప్పుడు మొక్కులు చెల్లించడం ఆనవాయితీగా భక్తులు విశ్వసిస్తారు.

పవిత్ర గౌతమి గోదావరి నది సమీపాన వెలసిన పురాతన ఆలయంగా భాసిల్లుతోంది. వ్యాస మహర్షి దక్షిణ భారతదేశ యాత్రలో ఇక్కడ స్వామివారిని ప్రతిష్టించారని, దక్ష ప్రజాపతి ఈ క్షేత్రంలో సిద్ధి వినాయకస్వామిని దర్శించి ద్రాక్షారామంలో ఎలాంటి ఆటంకాలు లేకుండా దక్షయజ్ఞం పూర్తి చేసినట్లు ఆలయ పురాణంలో ప్రస్తావించారు. దేవతలే ఈ ఆలయాన్ని నిర్మించారనేది పెద్దల మాట.

క్షేత్రంలో నిత్యం నారికేళాలతో స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, లక్ష్మీగణపతి హోమం జరుగుతుంటాయి. వేలాదిగా భక్తులు దర్శించుకుంటారు. చిన్నారులకు అక్షరాభ్యాసాలు, అన్నప్రాశనలు, నామకరణ కార్యక్రమాలు స్వామివారి సన్నిధిలో నిర్వహించుకునేందుకు భక్తులు ఆసక్తి చూపుతారు. విద్యార్థుల కోసం ఏటా సప్తనదీ జలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించి, ఆయన పాదాల వద్ద లక్ష పెన్నులు ఉంచి విశేష పూజల అనంతరం ఉచితంగా పంపిణీ చేస్తారు.

వినాయక చవితి సందర్భంగా తొమ్మిది రోజులపాటు నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా నిర్వహిస్తారు. స్వామి మూషికవాహనంపై ఆలయ మాడ వీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. దూరప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం వితరణ జరుగుతుంది. ఆలయ సమీపంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్మించిన సౌకర్యవంతమైన వసతి భవనం ఉంది.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading