గోంగూర మటన్
కావాల్సినవి: గోంగూర ఆకులు – 250 గ్రాములు; మేక మాంసం – 500 గ్రాములు; కొత్తిమీర – తగినంత; పుదీన – గుప్పెడు; ఉల్లిపాయలు – 2 (సన్నగా తరగాలి); అల్లం వెల్లుల్లిపేస్ట్ – 2 టీ స్పూన్లు; పసుపు – అర టీ స్పూన్; కొబ్బరి తురుము – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; కారం – తగినంత; మసాలా – (లవంగాలు –4, యాలకులు –4, ధనియాలు టేబుల్ స్పూన్. ఇవన్నీ కలిపి వేయించి, పొడి చేయాలి); గసగసాలు – టీ స్పూన్.

తయారీ:
►మటన్ ముక్కలను వేడినీటిలో 10 నిమిషాలు ఉడికించాలి
►పొయ్యిమీద గిన్నెపెట్టి నూనె వేసి వేడిచేయాలి
►అందులో సాజీరా ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి
►అల్లం వెల్లుల్లి ఫేస్ట్, పుసుపు వేసి కలపాలి
►అందులో మటన్ వేసి 5 నిమిషాలు ఉడికించాలి
►తగినంత కారం, ఉప్పు కలిపి ఉడికించాలి
►కొబ్బరి పొడి వేసి 15 నిమిషాలు ఉడికించాలి
►తరువాత తరిగిన గోంగూర ఆకులు వేసి ఉడికించాలి
►చివరగా గరం మసాలా, కొత్తి మీర వేసి దించాలి.
మటన్ పెప్పర్ ఫ్రై
రెస్టారెంట్ కి వెళితే మెనూ కార్డులో ఎన్నో నాన్ వెజ్ ఐటెమ్స్. రేట్లు చూస్తే భారీగా ఉంటాయి. పోనీ ఇంట్లోనే చేసుకుందామంటే చేయడం రాదు… అలాంటి వారి కోసమే… ఈ రెసిపీ. ఏ రెస్టారెంట్ కి వెళ్లినా కచ్చితంగా మటన్ పెప్పర్ ఫ్రై ఐటం ఉంటుంది. ఆ మటన్ పెప్పర ఫ్రై చాలా సులువుగా మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు.
కావాల్సిన పదార్థాలు
మటన్ – అరకిలో, ఉల్లిపాయలు – కప్పు (సన్నగా తరిగినవి), అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూనులు, పసుపు – అర టీస్పూను, టమోటో – అరకప్పు (చిన్నముక్కలుగా తరిగినవి), కారం – ఒక టీస్పూను, మిరియాల పొడి – రెండు టీ స్పూనులు, కొత్తిమీర – పావు కప్పు (సన్నగా తరిగినవి) కరివేపాకు – రెండు రెమ్మలు, సోంపు – అర టీస్పూను, మిరియాలు – ఒక టీస్పూను, గసగసాలు – అర టీస్పూను, ధనియాల పొడి – అర టీస్పూను, జీలకర్ర – ఒక టీస్పూను, దాల్చిన చెక్క – 1, లవంగాలు – 3, యాలకులు – 2, ఉప్పు – సరిపడినంత, నూనె – తగినంత
మటన్‌ను బాగా కడిగి ప్రెషర్ కుక్కర్‌లో వేసి, మూడు కప్పుల నీళ్లు, కాస్త పసుపు వేసి పావుగంట సేపు ఉడికించుకోవాలి. ఉడికిన మటన్ తీసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో సోంపు, జీలకర్ర, గసగసాలు, మిరియాలు, లవంగాలు, యాలకులు వేయించాలి. వాటిని చల్లార్చి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడెక్కాక కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు కూడా వేసి మూడు నిమిషాల పాటూ వేయించాలి. అనంతరం పక్కన పెట్టుకున్న మటన్ ముక్కల్ని అందులో వేసి బాగా వేయించాలి. బాగా వేయిస్తే నూనె పైకి తేలుతుంది. ఇప్పుడు టమోటో ముక్కలు, కారం, ముందుగా పొడి చేసిన మసాలా, ఉప్పు వేసి కలపాలి. పది నిమిషాలు మీడియం మంట మీద వేగనివ్వాలి. అనంతరం పెప్పర్ పౌడర్ మటన్న ముక్కలపై చల్లి బాగా కలిపి… మూడు నిమిషాల పాటూ వేగనివ్వాలి. అంతే మటన్ పెప్పర్ ఫ్రై సిద్ధమైనట్టే. దీనిపై కొత్తిమీర గార్నిష్ చేస్తే బాగుంటుంది.
మటన్ ఫ్రై..మటన్ కుర్మా

మటన్ ఫ్రై
కావలసినవి: మటన్ – 500 గ్రా.; కొబ్బరిపొడి – 150 గ్రా.; ఉల్లిపాయలు – 10 (చిన్నముక్కలుగా తరగాలి);పచ్చిమిర్చి– 5 (సన్నగా తరగాలి); లవంగాలు – 4,; దాల్చినచెక్క – చిన్న ముక్క; ఏలకులు – 4,;బిర్యానీ ఆకులు – 2; మిరప్పొడి – 4 టీ స్పూన్లు; దనియాల పొడి – నాలుగు టీ స్పూన్లు;పసుపు – టీ స్పూను; పచ్చిమిర్చి – రెండు (నిలువుగా చీరాలి గార్నిష్ కోసం); సన్నగా తరిగిన కొత్తిమీర – కప్పు; మెంతి ఆకు – 50 గ్రా.; నూనె – మూడు టేబుల్ స్పూన్లు; ఉప్పు – రుచికి తగినంత;

తయారి: మటన్‌ను శుభ్రం చేయాలి. పాత్రలో నూనె వేడిచేసి గరం మసాలా దినుసులన్నీ వేసి వేగిన తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నమంట మీద మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరవాత పచ్చిమిర్చి ముక్కలు,మెంతి ఆకులు, మిరప్పొడి, పసుపు, ధనియాల పొడి, ఉప్పువేసి బాగా కలపాలి. ఇప్పుడు మటన్ వేసి కలిపి సన్నమంట మీద ఉడకనివ్వాలి. మధ్యలో రెండు నిమిషాలకొకసారి కలియబెట్టి మూత పెడుతుండాలి. మాంసం ముక్క మెత్తబడిన తరవాత కొబ్బరిపొడి వేసి పది నిమిషాల పాటు దమ్ మీదఉడికించాలి. చివరగా కొత్తిమీర, పచ్చిమిర్చితో గార్నిష్ చేసి వడ్డించాలి.
మటన్ కుర్మా
కావలసినవి:మటన్ ముక్కలు – కేజీ; ఉల్లిపాయలు – 4 (సన్నగా తరగాలి); పెరుగు – 3 కప్పులు; కారం – 2 టేబుల్ స్పూన్లు; ధనియాల పొడి – 2 టేబుల్ స్పూన్లు; పసుపు – టీ స్పూన్; జీలకర్ర పొడి – పావు టీ స్పూన్; లవంగాలు – 5; ఏలకులు (పచ్చవి) – 6; దాల్చినచెక్క – అంగుళం; కుంకుమపువ్వు – కొన్నిరేకలు; ఉప్పు – తగినంత; అల్లం పేస్ట్ – టీ స్పూన్; వెల్లుల్లి పేస్ట్ – టీ స్పూన్; నూనె – కప్పు నెయ్యి – అర కప్పు; ఫ్రెష్ క్రీమ్ – 2 టేబుల్ స్పూన్లు;

తయారి: పాన్‌లో నూనె వేసి, ఉల్లిపాయలను గోధుమరంగు వచ్చేవరకు వేయించుకోవాలి. బాగా వేగిన ఉల్లిపాయ ముక్కలను కిచెన్ పేపర్‌లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఉల్లిపాయముక్కలు క్రిస్పీగా తయారయ్యాక వాటిని మిక్సర్‌లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. అదే పాన్‌లో మరికొంచెం నూనె వేసి మటన్‌ముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్ట్ కలిపి, ఆరు నిమిషాలు తక్కువ మంట మీద ఉడకనివ్వాలి. దీంట్లో కారం, ధనియాల పొడి, పసుపు, ఉప్పు,నల్లమిరియాల పొడి, ఏలకులు, లవంగాలు, దాల్చినచెక్క, జీలకర్రపొడి, పెరుగు, రెండుకప్పుల నీళ్లు కలిపి అరగంట సేపు సన్ననిమంట మీద ఉడికించాలి. ఉల్లిపాయ పొడి వేసి కలపాలి. ముక్క ఉడికి, నూనె పైకి తేలుతునప్పుడు కుంకుమపువ్వు, ఫ్రెష్ క్రీమ్, నెయ్యి కలిపి మూత పెట్టి మరో పదిహేను నిముషాలు ఉడికించాలి. దించేముందు కొత్తిమీర చల్లుకోవాలి. నోరూరించే మటన్ కుర్మాను వేడి వేడిగా నాన్‌లేదా చపాతీలోకి వడ్డించాలి.