📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

తెలంగాణలో పర్యాటక ప్రాంతాలు

  • వరంగల్ జిల్లా – కాకతీయుల రాజధాని అయినందున ఇచట వారు కట్టిన వెయ్యి స్తంభముల గుడి, ఓరుగల్లు కోట, రామప్ప గుడి, భద్రకాళి అమ్మవారి గుడి, లక్నవరము చెరువు, పాకాల సరస్సు, కాకతీయ సంగీత ఉద్యానవనము చూడదగినవి. ప్రకృతి దృశ్యాల కొఱకు ఏటూరునగరము వన్యప్రాణుల అభయారణ్యము,బోగత, భీముని పాదము, ముత్యాల ధార జలపాతములు, అబ్బురపరిచే ప్రదేశములు.

వెయ్యి స్తంభముల గుడి

ఓరుగల్లు కోట

రామప్ప గుడి

భద్రకాళి అమ్మవారి గుడి

లక్నవరము చెరువు, గొలుసు కట్టు వంతెన

పాకాల చెరువు

బోగత జలపాతము – తెలంగాణ నయాగరా

భీముని పాద జలపాతము

ముత్యాల ధార జలపాతము

  • మహబూబ్నగర్ జిల్లా – శాతవాహనులు, చాళుక్యులు రాజ్యాల ముఖ్యమైన ప్రాంతము. చారిత్రాత్మక కట్టడాల కొఱకు శ్రీ రంగనాయక స్వామి గుడి, నవబ్రహ్మ జోగులాంబ గుళ్ళు, సోమేశ్వర స్వామి గుడి, ఉమా మహేశ్వరము, జెటప్రోలు, మన్యం కొండ, కురుమూర్తి స్వామి గుడి, కొల్లాపురము భవంతి, ఖిల్లా ఘనపురము, ప్రకృతి దృశ్యాల కొఱకు పిల్లల మఱ్ఱి ఉద్యానవనము, మల్లెలతీర్థ జలపాతము, అమ్రాబాద్ పులి సంరక్షణ అడవి, కోయిల్ సాగర్ ఆనకట్ట, జురాల ఆనకట్ట, సోమశిల ఆనకట్ట కనువిందు చేయును.

శ్రీ రంగనాయక స్వామి గుడి, శ్రీ రంగాపురము

జోగులాంబ సహిత నవబ్రహ్మ గుళ్ళు

ఉమా మహేశ్వర పుణ్య క్షేత్రము, నల్లమల

లలిత సోమేశ్వర స్వామి గుడి, సోమశిల

జెటప్రోలు మధన గోపాల స్వామి గుడి

మన్యంకొండ వెంకటేశ్వర స్వామి గుడి

కురుమూర్తి స్వామి గుడి

కొల్లాపురము భవంతి

ఘనపురం కోట / ఖిల్లా ఘనపూర్

కోయిల్ కొండ కోట

పిల్లల మఱ్ఱి ఉద్యానవనము – 800 ఏళ్ల మఱ్ఱి చెట్టు

మల్లెల తీర్థ జలపాతము

అమ్రాబాద్ పులి సంరక్షణ అడవి – నల్లమల

నల్లమల కొండల మధ్య కృష్ణా నది అందాల దృశ్యాము, అమ్రాబాద్

సోమశిల ఆనకట్ట

కోయిల్ సాగర్ ఆనకట్ట

జురాల ఆనకట్ట

  • అదిలాబాదు జిల్లా – అదిలాబాదు జిల్లా జలపాతాలకు, వన్యప్రాణుల అభయారణ్యముకు పెట్టినది పేరు. కుంతల జలపాతము, గాయత్రి జలపాతము, పొచ్చెర జలపాతము, కనకై జలపాతములు, కవ్వాల్, శివరాం, ప్రాణహిత, వన్యప్రాణుల అభయారణ్యములు, వీటితోపాటు బాసర సరస్వతి అమ్మవారి గుడి, జైనాథ గుడి కడ్డం ఆనకట్ట ఆకట్టుకునే ప్రదేశములు.

కుంతల జలపాతము

గాయత్రి జలపాతము

పొచ్చెర జలపాతము

కనకై జలపాతము

కవ్వాల వన్యప్రాణుల అభయారణ్యము

సరస్వతి గుడి, బాసర

కడ్డం ఆనకట్ట

జైనాథ్ గుడి

  • ఖమ్మం జిల్లా – కాకతీయుల రాజ్యము ముఖ్యమైన ప్రాంతము. చారిత్రాత్మక స్థలాలయిన భద్రాద్రి, పర్ణశాల, నేలకొండపల్లి, కుసుమంచి, ప్రకృతి అందాల కొఱకు కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యము, లకారం చెరువు రమణీయమైన ప్రదేశములు.

భద్రాద్రి రామయ్య గుడి

పర్ణశాల

ఖమ్మం కోట

నేలకొండపల్లి బౌద్ధ ప్రాంతము

జమలపురము వెంకటేశ్వర స్వామి గుడి

కుసుమంచి శివుని గుడి

స్థంభాద్రి నరసింహ స్వామి గుడి – ఈ గుడి చే ఖమ్మం పేరు వచ్చినది.

కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యము

లకారం చెరువు

  • కరీంనగర్ జిల్లా – శాతవాహనుల మొదటి రాజధాని, కాకతీయులు, మౌర్యులు, అసఫ్ జాహీలు, రాజ్యములు పరిపాలించిరి. చారిత్రాత్మక కట్టడాల కొఱకు వేములవాడ, కోటిలింగాల క్షేత్రము, కొండగట్టు ఆంజనేయస్వామి గుడి, కాళేశ్వరము, ధర్మపురి, ఎలగందల కోట, నగునూరు కోట, రామగిరి కోట, జగిత్యాల కోట, సబ్బితం జలపాతము, మానేరు ఆనకట్ట అందమైన ప్రదేశములు.

రాజేశ్వర స్వామి గుడి, వేములవాడ

కోటి లింగాల గుడి

కొండగట్టు ఆంజనేయస్వామి గుడి

కాళేశ్వర పుణ్య క్షేత్రము

ధర్మపురి క్షేత్రము

ఎలగందల కోట

నగునూరు కోట

రామగిరి కోట

జగిత్యాల కోట

సబ్బితం జలపాతము

  • నిజామాబాదు జిల్లా – చారిత్రాత్మక కట్టడాల కొఱకు నిజామాబాదు కోట, డిచ్ పల్లి కోట, దోమకొండ కోట, వంద స్తంభముల గుడి, నీలకంఠేశ్వర స్వామి గుడి, ప్రకృతి అందాల కొఱకు అశోక్ సాగర్ చెరువు, పోచారం అభయారణ్యము, మల్లారం అడవి, శ్రీ రామ సాగర్, నిజాం సాగర్, అలీ సాగర్ ఆనకట్టలు గొప్ప ప్రదేశములు.

కౌలాస కోట

నిజామాబాదు కోట

డిచ్ పల్లి రామాలయము – దక్షిణ ఖజురహో అనవచ్చును.

దోమకొండ కోట

నీలకంఠేశ్వర స్వామి గుడి

వంద స్తంభముల గుడి

అశోక్ సాగర్ చెరువు

పోచారం వన్యప్రాణుల అభయారణ్యము

నిజాం సాగర్ ఆనకట్ట

శ్రీ రామ సాగర్ ఆనకట్ట

  • నల్గొండ జిల్లా – చారిత్రాత్మక క్షేత్రముల కొఱకు యాదాద్రి నరసింహ స్వామి గుడి, భువనగిరి కోట, నందికొండ, పానగల్లు గుడి, ఫణిగిరి బౌద్ధ ప్రాంతము, కొలనుపాక జైన గుడి, మేళ్ళచెరువు శింబు లింగేశ్వర స్వామి గుడి, పిల్లల మఱ్ఱి గుడి , మరియు నాగార్జున సాగర్ ఆనకట్ట చక్కటి ప్రదేశములు.

యాదాద్రి నరసింహ స్వామి గుడి – పునర్నిర్మాణ దృశ్యము

భువనగిరి కోట

నందికొండ బౌద్ధ ప్రాంతము

ఛాయా సోమేశ్వర స్వామి గుడి

పిల్లల మఱ్ఱి గుడి, సూర్యాపేట

కొలనుపాక జైన గుడి

మేళ్ళచెరువు శంబు లింగేశ్వర స్వామి గుడి

ఫణిగిరి బౌద్ధ ప్రాంతము

నాగార్జునసాగర్ ఆనకట్ట

  • మెదక్ జిల్లా – చారిత్రాత్మక కట్టడాలయిన మెదక్ కోట, మెదక్ చర్చి, కోటిలింగేశ్వర స్వామి గుడి, వర్గల్ సరస్వతి గుడి, ఏడుపాయల దుర్గా భవాని గుడి, ప్రకృతి అందాల కొఱకు పోచారం, సింగూరు ఆనకట్టలు సుందరమైన ప్రదేశములు.

మెదక్ కోట

మెదక్ చర్చి

కోటిలింగేశ్వర స్వామి గుడి, సిద్ధిపేట

వర్గల్ సరస్వతి గుడి

ఏడుపాయల దుర్గా దేవి గుడి

పోచారం ఆనకట్ట

సింగూరు ఆనకట్ట

  • రంగారెడ్డి జిల్లా – చారిత్రాత్మక గుళ్ళ కొఱకు కీసరగుట్ట, చిలుకూరు బాలాజీ గుడి, అమ్మలపల్లి శ్రీ సీతారామ చంద్రస్వామి గుడి, ప్రకృతి దృశ్యాల కొఱకు అనంతగిరులు, గండిపేట చెరువు, హిమాయత్ సాగర్ అబ్బురమైన ప్రదేశములు.

అమ్మలపల్లి శ్రీ సీతారామ చంద్రస్వామి గుడి

చిలుకూరు బాలాజీ గుడి

అనంత పద్మనాభ స్వామి గుడి, అనంతగిరులు

అనంతగిరులు – తెలంగాణ ఊటి

గండిపేట చెరువు

హిమాయత్ సాగర్ చెరువు

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading