📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

కోడిగుడ్లతో చేసే కూరలు

మసాలా ఎగ్‌ కర్రీ 

కావలసినవి:


ఉల్లిపాయలు-2,
టమాటాలు-2 , కాప్సికం-1, కోడిగుడ్లు-2
అజినోమోటో-చిటికెడు, సోయాసాస్‌-పావ్ఞటేబుల్‌స్పూన్‌
చిల్లీసాస్‌-అరటేబుల్‌స్పూన్‌,
టమాటాసాస్‌-ఒక టేబుల్‌స్పూన్‌
ఉప్పు-తగినంత,
మిరియాలపొడి-పావ్ఞటేబుల్‌స్పూన్‌
కొత్తిమీర-కొద్దిగా,
నూనె-మూడు టేబుల్‌స్పూన్లు


తయారుచేసే విధానం


కోడిగుడ్లను ఉడికించి పెంకుతీసి కొంచెం పెద్దసైజుముక్కలుగా కట్‌ చేయాలి. అదేవిధంగా ఉల్లిపాయలు, కాప్సికం, టమాటాలను కూడా పెద్దసైజు (సుమారు అంగుళం సైజు) ముక్కలుగా కట్‌చేసి పెట్టుకోవాలి.

పాన్‌లో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించాలి. తర్వాత కాప్సికం ముక్కలు వేసి కొంచెం మెత్తబడేవరకు వేసి టమాట ముక్కలు వేయాలి. ఇవన్నీ కలుపుతూ అజినోమోటో, సోయాసాస్‌, టమాటాసాస్‌, చిల్లీసాస్‌ వేసి కలపాలి. రెండు నిమిషాల తర్వాత గుడ్డు ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి వేసి కొద్దిసేపు వేసి కొత్తిమీర చల్లి దింపేయాలి. అలాగే స్నాక్‌లా సర్వ్‌ చేయొచ్చు. లేదా నూడుల్స్‌, ఫ్రైడ్‌రైస్‌తో కలిపి సర్వ్‌ చేయొచ్చు.

కోడిగుడ్లుతో స్పెషల్ కర్రీ

కోడిగుడ్లుతో స్పెషల్ కర్రీ

ఉక్కిరి, ఆమ్లెట్ కూర, టొమాటో కూర… ఇవేనా కోడిగుడ్లతో చేసే కూరలు…స్పెషల్ కర్రీ కూడా చేసుకోవచ్చు. అదెలాగో చూడండి.

కావలసినవి: ఉడకబెట్టిన గుడ్లు – రెండు, ఉల్లిపాయలు – రెండు, అల్లం వెల్లుల్లి పేస్టు – రెండు స్పూనులు, పచ్చిమిరపకాయలు – 8, టొమాటోలు – రెండు, కారం – తగినంత, మిరియాలపొడి – పావు టీస్పూను, అజినోమోటో – అరటీస్పూను, కొత్తిమీర – అరకప్పు, ఉప్పు – రుచికి తగినంత, నూనె – సరిపడినంత

తయారీ: కోడిగుడ్లని ఉడకబెట్టి మెత్తగా చేసి పెట్టుకోవాలి. కళాయి స్టవ్ మీద పెట్టి తగినంత నూనె పోయాలి. నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి వేసి వేయించాలి. అల్లం వెల్లుల్లి పేస్టుని కూడా వేయాలి. టొమాటోను మిక్సీలో పేస్టు చేసి దానిని కళాయిలో వేసి వేపాలి. బాగా వేగాక కప్పు నీళ్లు వేసి కలపాలి. తగినంత ఉప్పు, కారం, మిరియాల పొడి, చిటికెడు అజినోమోటో వేసి ఉడికించాలి. ఇప్పుడు ముందుగా చేసుకున్న మెత్తగా చేసిన కోడిగుడ్లను అందులో వేసి కలుపుకోవాలి. నీరు ఇంకి గ్రేవీలా అయ్యేవరకు స్టవ్ మీదే ఉంచాలి. ఇగురులా అవ్వగానే స్టవ్ ఆపేసి కొత్తిమీర తరుగునూ మీద చల్లాలి. అంతే కోడిగుడ్లతో స్పెషల్ కర్రీ సిద్ధం.

ఎగ్‌ 65′

Egg 65
చికెన్ 65, మటన్ 65, ఫిష్ 65… ఇలా రకరకాల 65 విన్నాము. కానీ కొత్తగా ఈ ‘ఎగ్ 65’ ఏంటి అనుకుంటున్నారా?.. మాంసాహారం తిననివారు, పిల్లలు ఎంతో ఇష్టంగా తినే గుడ్డుతో చేసేదే ఈ ‘ఎగ్ 65’. ఇది మంచి రుచిగా ఉండటంతోపాటు… ఆరోగ్యానికి మేలు కూడా చేస్తుంది.

‘ఎగ్‌ 65’ తయారీకి కావాల్సిన పదార్థాలు: గుడ్లు: 6, అల్లం: 2 ముక్కలు, వెల్లుల్లి: 6 – 10 రెబ్బలు, పచ్చిమిర్చి: 6, కొత్తిమీర: కప్పు, కరివేపాకు: కప్పు, గరం మసాలా: 4 టీ స్పూన్లు (తక్కువ కూడా వేసుకోవచ్చు), కారం పొడి: సరిపడినంత, కశ్మీరీ కారంపొడి (రంగు కోసం): 2 టీ స్పూన్లు, ఉప్పు: సరిపడా, పెరుగు: 2 కప్పులు, చిల్లీ సాస్: కొద్దిగా, జీలకర్ర పొడి: 2 లేదా 3 టీ స్పూన్లు, చక్కెర: 2 టీ స్పూన్లు, కార్న్ఫ్లోర్: 1 లేదా 2 కప్పులు.
samayam telugu

తయారీ విధానం:
* మొదటగా గుడ్లు ఉడకబెట్టుకోవాలి. ఉడికిన తర్వాత గుడ్డులో నుంచి పచ్చసొన వేరుచేసి, తెల్లగుడ్డు మాత్రమే తీసుకుని చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
* ఈ ముక్కలకు… సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కొద్దిగా కారం, గరంమసాలాతోపాటు కొద్ది పరిమాణంలో బ్రెడ్ పౌడర్, కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి.
* రెండు పగుల గొట్టిన గుడ్ల నుంచి తీసిన తెల్లసొన (ఎగ్ వైట్)ను ఈ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలి.
* స్టౌ వెలిగించుకుని బాణలిలో నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ ఉండలను నెమ్మదిగా స్పూన్ లేదా చేతితో నూనెలో వేసుకోవాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అన్ని ముక్కలు వేగాక తీసి పక్కన పెట్టుకోవాలి.
* మరో ప్యాన్‌లో కొద్దిగా నూనె వేసి… వేడెక్కగానే అందులో తరిగిన అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేయించుకోవాలి. పచ్చి మిర్చిని రెండుగా చీల్చినవే వేసుకోవాలి.
* కాసేపే వేగాక… ఇందులో కప్పు లేదా సరిపడా పెరుగు వేసుకోవాలి. కాస్తా ఉడకగానే… ఇందులో కాస్తా కశ్మీరీ కారం పొడి, గరం మసాలా, జీలకర్ర పొడితోపాటు కొద్దిగా చిల్లీ సాస్ వేసుకోవాలి. కొద్దిగా చక్కెర వేస్తే రుచికి బాగుంటుంది. తర్వాత తరిగిన కొత్తిమీర వేసుకోవాలి.
* ఇక చివరగా… ముందుగా ఫ్రైచేసి పెట్టుకున్న ఉండలను వేయాలి. మంట కాస్తా పెంచి… ముక్కలకు గ్రేవీ బాగా పట్టేవరకు ప్యాన్‌ను అటు ఇటూ కదపడం చేయాలి. బాగా ఉడికింది అనుకుంటే… వెంటనే స్టౌ ఆర్పేయాలి. ఇక అంతే… రుచికరమైన ఎగ్ 65 రెడీ అయినట్లే…

samayam telugu

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading