హిందూ సాంప్రదాయంలో బొట్టుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. బొట్టులేని ముఖము,..ముగ్గులేని ఇల్లు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు.. రెండూ కూడా స్మశానంతో సమానం..అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటిముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో, అదే విధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు,..దరిద్రదేవత తాండవం చేస్తాయి…అని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్రదేవతగా పిలువబడే జ్యేష్టదేవి ఇద్దరూ భార్యా భర్తలే. కాబట్టి ఒకరు ఉంటే రెండోవారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు.వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు. కాబట్టి ముఖానికి బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు.
ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుండి వచ్చేటటువంటి నకారాత్మక శక్తి అంటే నెగెటివ్ఎనర్జీ అంటారు..అది మనపై పడుతుంది. నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అలాగే ఎదురుగా ఉండేటటువంటి వారు..మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగెటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రెండింటికీ మధ్యలో ఉండేటటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్యభాగంలో ఉంటాయి. ఎప్పుడైతే దృష్టి మనమీద పడిందో.. అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి.ఆ నాడులు ఒత్తిడికి లోనవటం వలన..ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి.అంటే మెదడుకు సంభందించినటు వంటి నాడులు మన ముఖములో కనబడుతాయి.కాబట్టి ఆ మెదడు దెబ్బ తింటుంది. మెదడు దెబ్బ తినడం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది.మనఃశాంతి పోతుంది. చిరాకు వస్తుంది.ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటి వారి యొక్క కంటిచూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే.. మెదడును కాపాడుకోవాలంటే..
మనకు ఉన్నటువంటి పాజిటివ్ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితముగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి.
అంటే బొట్టు పెడితే చాలు.
మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుట మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది.తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపకశక్తి, మేధాశక్తి అన్నీ రకాలయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి.ఎటువంటి ఒత్తిడికి లోనూ కావు.మనల్ని కాపాడుతూ ఉంటాయి.మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి.అందుకని బొట్టు ఖచ్చితంగా పెట్టుకోవాలి.
సైంటిఫిక్ గా కూడా తప్పనిసరిగా సైన్సు ప్రకారం కూడా ఇది నిరూపించడం జరిగింది.అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి.ఋణ బాధలు ఉన్నటువంటివారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవడం వలన ఋణబాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. అదే విధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనఃశాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి. పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా..సౌభాగ్యవతులే కాకుండా..మగవారే కాకుండా..వైథవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా..
కుంకుమను ధరించవచ్చు దానినే గంగసింధూరము అంటారు.ఆంజనేయస్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైదవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు.ఎటువంటి తప్పూ లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే.ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను మనం పొందగలుగుతాము. దానితో పాటుగా మన యొక్క రక్షణను కూడా మనం పొందగలుగుతాము. ఇవన్నీ కూడా పెద్దవారు మనకు ఏర్పాటు చేసినటువంటి బంగారుబాటలు.అందుకని చక్కగా కుంకుమను ధరించండి.
అందం కోసం మరియు ఆధ్యాత్మికత కోసం… పిల్లలు, పెద్దలూ, మగవారు, స్త్రీలు అంతా నుదుట బొట్టు ధరించడం భారతీయ సనాతన సంప్రదాయం. చందనం, విభూతి, కుంకుమ… ఏది ధరించినా మంచిదేనని హైందవ ధర్మం తెలుపుతుంది. నుదుటిలో రెండు కనుబొమల మధ్య ఉండే ఆజ్ఞాచక్రం మీద వేలితో నెమ్మదిగా నొక్కుతూ సిందూరాన్ని కానీ, కుంకుమను కాని పెట్టుకోవటం వల్ల అక్కడి నరాలు ఉత్తేజితమై జ్ఞాపకశక్తినీ ఆలోచనాశక్తీ పెంపొందిస్తాయని యోగశాస్త్రం తెలుపుతుంది.
పద్మపురాణం, ఆగ్నేయ పురాణం, పరమేశ్వర సంహితలోనూ బొట్టు ప్రస్తావన కనిపిస్తుంది. నుదుటన కుంకుమ బొట్టు పెట్టుకోవటం ముత్తైదువుల ఐదోతనానికి చిహ్నంగా భావిస్తారు హిందూ స్త్రీలు. శుభకార్యాలకు బొట్టుపెట్టి పిలవటం హిందూ సాంప్రదాయం.
నుదుటి భాగాన్ని జ్ఞాననేత్రం, శక్తికేంద్రంగానూ పరిగణిస్తారు. అది పీనియల్ గ్రంథి స్థానం కూడా. ఇది మానసిక ఆరోగ్యానికి మేలు చేసే హార్మోన్లని పెంపొందించి ఒత్తిళ్ళను దూరం చేస్తుందనీ మంచి ఆలోచనలు కలిగించేందుకు తోడ్పడుతుందనీ చెబుతారు శాస్త్రనిపుణులు. వీటన్నిటికీ తోడు బొట్టు ముఖానికి అందం కూడా వస్తుంది. చూసేవారికి కూడా ముచ్చటగా ఉంటుంది.బొట్టు పెట్టుకున్నవారి మీద ఎదుటవారిలో గౌరవం కలుగుతుంది.
యోగ పరంగా చూసుకుంటే: మానవ శరీరంలోని షట్చక్రాల్లో ఒకటైన ఆజ్ఞా చక్రం కనుబొమ్మల మధ్యలో నెలకొని ఉంటుంది.. ఈ ఆజ్ఞా చక్రాన్ని మూడవ కన్ను గా కూడా వ్యవహరిస్తారు.. బయటకి కనపడే రెండు కళ్ళలో ఒకటి గతాన్ని, మరొకటి ప్రస్తుతాన్ని సూచిస్తాయి,అయితే ఈ మూడవ కన్ను మాత్రం భవిష్యత్తు ని సూచిస్తుంది అని చెప్తారు.. ఈ చక్రం ద్వారా ఆధ్యాత్మితకతను మెరుగుపరచుకోవచ్చు అని చెప్తారు..
మీరు ధరించే “విబూధి” ,లేదా “కుంకుమ” ఈ ఆజ్ఞా చక్రాన్ని మరింత సక్రియం జరిపే అలంకరణ అని చెప్పవచ్చు.. ఇక హిందూ మతంలో ఉన్న విభిన్న శాఖల్లో బొట్టుని ఒకొక్కరు ఒక్కో రకంగా ధరించడం చూడవచ్చు..
- వైష్ణవులు ధరించే బొట్టు నిలువుగా ఉంటుంది.. రెండు తెల్లని గీతలు శ్రీ మహా విష్ణువు యొక్క పాదపద్మాలను సూచిస్తే, ఎర్రటి గీత శ్రీ మహాలక్ష్మి ని సూచిస్తాయి.. వీటిని “ఊర్ధ్వపుండ్రాలు” గా వ్యవహరిస్తారు..
ఈ బొట్టునే తెల్లటి గీతలు భగవంతుని పాదపద్మాలుగా, ఎర్రటి గీత భక్తునిగా కొంతమంది వ్యవహరిస్తారు..
- ఇక శైవ ఆరాధన లో విభూధి ని మూడు అడ్డ గీతలుగా ధరిస్తారు.. ఈ మూడు గీతల వెనుక అనేక కారణాలు చెప్తారు..
* “సత్వ” ,”రజస్”, “తమో” గుణాలకు ప్రతీకగా..
* శివుడి మూడు నేత్రాలకు ప్రతీకగా ..
* శివుడు కాలుడు కనుక “గతం”, “వర్తమానం”, “భవిష్యత్” కాలాలకు ప్రతీకగా ..
ఇలా రకరకాల సంప్రదాయాల్లో బొట్టుని ధరిస్తారు.