📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Mutton Varities

కాశ్మీరీ మటన్ పలావ్

కావలిసినవి
మటన్ : అరకిలో
బాస్మతి బియ్యం : 1 కిలో (అరగంటసేపు నానబెట్టుకోవాలి)
పెరుగు : 2 స్పూన్లు
శొంఠి పొడి : టీ స్పూన్
యాలకుల పొడి : పావు స్పూను
కుంకుమపువ్వు : 2 గ్రాములు
కారం : 2 స్పూన్లు
గరం మషాలా : రెండు స్పూన్లు
ఉప్పు : రుచికి సరిపడా వేసుకోవాలి

తయారు చేయువిధానం
ఒక వెడల్పాటి పాన్ లో నెయ్యువేసి వేడెక్కిన తరువాత మటన్ ముక్కలు, ఇంగువ వేసి రెండునిమిషాల పాటు వేయించాలి. తరువాత పెరుగు కలిపి మరలా కొద్దిసేపు వేయించాలి. ఇప్పుడు ఉప్పు, కారం, పలావు ఆకు ఒకటి వేసి వేయించాలి. ఉడకటానికి కొద్దిగా నీరు కలపవచ్చు. గరమ్ మషాలా కూడా వేసి మటన్ కొద్దిగా మెత్తబడేదాకా ఉంచి యాలకుల పొడి,శొంఠిపొడి, కుంకుమపువ్వు, కారం, తగినంత ఉప్పు కూడా కలుపుకోవాలి కొద్దిసేపు ఉంచాలి. ఇలా తయారైన మటన్ ను వేరుగా ఒకగిన్నెలోకి తీసికోవాలి, అదే పాన్లో రెండు లీటర్ల నీరుపోసి కొద్దిగా సోంప్ పొడి స్పూన్ గరం మషాలపొడి పలచని గుడ్డలో మూటకట్టి నీళ్లలో వేయాలి. తరువాత బాస్మతీ బియ్యం కూడా వేసి సిమ్ లో బియ్యం పూర్తిగా కాకుండా సగం దాకా ఉడకనివ్వాలి. ఇది కూడా వేరుగా తీసుకొని (నీరు ఎక్కువగా ఉంటే వంపేయాలి.) అదే పాన్లో అన్నము కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మటన్ ముక్కలు కొద్దిగా సమాంతరంగా పరచి దానిపైన మరలా అన్నం, అన్నంపైన మటన్ ముక్కలు ఇలా అంతా అయిపోయేదాకా వేయాలి. ఇపుడు సిమ్ లో పూర్తిగా అన్నం, మటన్ ఉడికేదాకా ఉంచి దించేటపుడు (అవసరమైతే కొద్దిగా నీరు కలుపుకోవాలి) సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకోవాలి.

మటన్ ఫ్రై

కావలసినవి
మటన్ : అరకిలో
పెరుగు : 1 కప్పు
ఉల్లిపాయ : 1 పెద్దది తరుగుకోవాలి
గరం మషాలా : 1 స్పూను
మిరియాలు : అరస్పూను
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు
కరివేపాకు : 2 రెమ్మలు
నూనె : 1 కప్పు
ఉప్పు : రుచికి సరిపడా వేయాలి
పసుపు : అర స్పూను
కారం : 2 స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా సన్నగా తరుగుకోవాలి
తయారు చేయు విధానం అల్లం, వెల్లుల్లి, మిరియాలు, అన్నీ కలిపి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఒక వెడల్పాటి పాత్ర తీసుకుని మటన్ ముక్కలు, టేబుల్ స్పూన్ నూనె, పసుపు, ఉప్పు, పెరుగు వేసి బాగా కలిపి రెండుగంటలు నాననివ్వాలి.
స్టౌ వెలిగించి బాణాలి లేక నాన్ స్టిక్ పాత్ర పెట్టి అందులో నూనె పోయాలి. నూనె వేడెక్కిన తరువాత కరివేపాకు, తరిగిన ఉల్లిపాయలు, ధనియాల పొడి, అల్లం, వెల్లుల్లి, మిరియాలు రుబ్బినవి వేసి వేయించాలి. కొద్దిగా వేగిన తరువాత అందులో నానబెట్టిన మటన్ కూడా వేసి సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, గరం మషాలా వేసి బాగా వేగనిచ్చి దింపుకోవాలి.

మటన్ కర్రీ

కావలసినవి
మటన్ : అరకిలో
ఉల్లిపాయ : 1 పెద్దది
టమాటోలు : 3 మీడియం సైజువి
మిరియాలు : అరస్పూను
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు
కరివేపాకు : 2 రెమ్మలు
నూనె : 2 టీ స్పూన్లు
ఉప్పు : రుచికి సరిపడా వేయాలి

పసుపు : అర స్పూను
కారం : 2 స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా సన్నగా తరుగుకోవాలి
మంచినీళ్లు : 2 కప్పులు
తయారు చేయు విధానం
మోటోలు, అల్లం, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, అన్నీ కలిపి మొత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కుక్కర్లో మటన్ ముక్కలు వేసి రెండు కప్పులు నీళ్లు పోసి రెండు విజిల్స్ వచ్చేదాకా ఉంచాలి. కుక్కర్ ఆవిరి పోయిన తరువాత ఓపెన్ చేయాలి. పాన్ లో 2 స్పూన్ల నూనె వేసి వేడెక్కిన తరువాత కరివేపాకు, ఉల్లిపాయలు, గ్రైండ్ చేసిన మిశ్రమం, ధనియాల పొడి వేసి మంచి కలర్ (గోల్డ్ బ్రౌన్ కలర్) వచ్చేదాకా వేయించుకోవాలి. ఇష్టమున్నవారు గరమ్ మషాలా ఒకస్పూన్ వేసుకోవచ్చు. తరువాత మటన్ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి కొద్దిగా నీరు పోసి బాగా ఉడికిన తరువాత కొత్తిమీర చల్లుకొని దించుకోవాలి.

Keema curry – కీమా కూర

కావలిసినవి
కీమా: పావుకిలో
టొమాటోలు: రెండు
ఉల్లిపాయలు: రెండు
పచ్చిమిర్చి : 2 నిలువుగా చీల్చుకోవాలి
దనియాలపొడి: 2 టీస్పూన్లు
నూనె: అరకప్పు
పసుపు: చిటికెడు
బంగాళాదుంపలు: రెండు
గరంమసాలాపొడి: టీస్పూను
కారం: 1 చెంచాలు
ఉప్పు: తగినంత
అల్లంవెల్లుల్లిముద్ద: 2 చెంచాలు
కొత్తిమీర: కట్ట
తయారు చేయువిధానం
బాణలిలో నూనె వేసి కాగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించాలి. . తరువాత గరంమసాలా పొడి వేయాలి పసుపు, కారం, దనియాలపొడి వేసి కలపాలి. ఇప్పుడు కీమా వేసి సుమారు పావుగంటసేపు ఉడికించాలి. తరువాత ముక్కలుగా కోసిన బంగాళాదుంప, టొమాటోముక్కలు, ఉప్పు వేసి కలిపి మరో పావుగంటసేపు ఉడికించి, దించేముందు కొత్తిమీర చల్లాలి.

Gongura Mutton / గోంగూర మటన్

కావలసినవి
మటన్ చిన్న ముక్కలు: అరకిలో
ఉల్లిపాయలు: పావుకిలో
అల్లం,వెల్లుల్లి పేస్ట్: 2 టేబుల్స్పూన్లు
కారం: టేబుల్స్పూను
పసుపు: టీస్పూను
కొత్తిమీర: కట్ట
పుల్లగోంగూరకట్టలు: ఐదు
పచ్చిమిర్చి: ఎనిమిది
నూనె: 50గ్రా.
ఉప్పు: తగినంత.
తయారు చేయు విధానం
మటన్ ముక్కల్ని కుక్కర్లో ఉడికించుకోవాలి. వెడల్పాటి పాన్ లో నూనె వేసి వేడెక్కిన తరువాత ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత ఉడికిన మటన్ ముక్కలు అల్లంవెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి కొద్దిసేపు ఉడికించాలి
వేరొక పాత్రలో బాణలిలో గోంగూరను వేసి ఉడికించి మెత్తని ముద్దలా చేసి, ఈ ముద్దను వేయిస్తోన్న మటన్లో వేసి మరో పది నిమిషాలు ఉడికించి, ఉప్పు సరిచూసి దించాక కొత్తిమీర చల్లుకుని దించుకోవాలి.

మటన్‌ హలీమ్‌

Hyderabadi Haleem: How to Make Mutton Haleem in Home Step by Step - Sakshi

కావల్సిన పదార్థాలు: బోన్‌లెస్‌ మటన్‌ –500 గ్రాములు; నెయ్యి– అరకప్పు; జీలకర్ర – ఒకస్పూన్‌; తోక మిరియాలు –ఒకస్పూన్‌; దాల్చిన చెక్క –మీడియం సైజు ఒకటి; లవంగాలు – మూడు; సాజిరా –ఒక స్పూన్‌; యాలకులు – మూడు; పెద్ద ఉల్లిపాయలు –మూడు; అల్లంవెల్లుల్లి పేస్టు –రెండు స్పూన్లు; గరం మసాల–ఒక స్పూన్‌; పచ్చిమిర్చి –నాలుగు; పెరుగు –ఒక కప్పు; పసుపు –ఒక స్పూను; గోధుమ రవ్వ –ఒకటిన్నర కప్పు; శనగపప్పు –ఒకస్పూన్‌; పెసరపప్పు –ఒక స్పూన్‌; ఎర్ర పప్పు(మసూరి పప్పు) –ఒక స్పూన్‌; కొత్తిమీర – మీడియం సైజు కట్ట ఒకటి; పుదీనా – మీడియం సైజు కట్ట ఒకటి; నిమ్మకాయ –ఒకటి; అల్లం –చిన్న ముక్క; నీళ్లు– 12 కప్పులు; ఉప్పు – తగినంత; జీడిపలుకులు– కొద్దిగా.

తయారీ విధానం: 

ముందుగా గోధుమరవ్వ, పెసరపప్పు, శనగపప్పు, ఎర్ర పప్పులను విడివిడిగా కడిగి రాత్రంతా నానపెట్టుకోవాలి. రాత్రి నానపెట్టుకోవడం కుదరనివారు కనీసం రెండు గంటలైనా నానపెట్టాలి. తరువాత మటన్‌ను శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో అల్లంవెల్లుల్లి పేస్టు, కొద్దిగా ఉప్పు, పెరుగు, పసుపు, గరం మసాల వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్‌ మీద ప్రెజర్‌ కుక్కర్‌ పెట్టుకుని దానిలో కొద్దిగా నెయ్యి వేసి వేడెక్కిన తరువాత కలిపి పెట్టుకున్న మటన్‌ మిశ్రమాన్ని దానిలో వేయాలి. ఒక ఐదు నిమిషాలపాటు నెయ్యిలో మటన్‌ వేగిన తరువాత దానిలో రెండు కప్పులు నీళ్లుపోయాలి. తరువాత కుక్కర్‌ మూత పెట్టి పది విజిల్స్‌ వచ్చేంతవరకు ఉడికించాలి.

మటన్‌ ఉడికిన తరువాత చల్లారనిచ్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకుని పక్కన పెట్టుకోవాలి. తరువాత నాన పెట్టుకున్న అన్ని రకాల పప్పులను ఒక గిన్నెలో వేసి ఉడికించాలి. ఇవి ఉడుకుతుండగానే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, తోక మిరియాలు, జీలకర్ర, సాజిరా వేసి దానిలో పది కప్పుల నీళ్లు పోసి బాగా ఉడికించాలి. ఇవన్నీ ఉడికిన తరువాత వీటన్నింటిని మిక్సీలో వేసి ప్యూరీలా గ్రైండ్‌ చేసుకోవాలి. ఉల్లిపాయలను సన్నగా తరిగి వాటిని ఎర్రగా వచ్చేంతవరకు వేయించి పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు స్టవ్‌ మీద మరో పాన్‌ పెట్టుకుని దానిలో మూడు స్పూన్ల నెయ్యి వేసి వేడెక్కిన తరువాత దానిలో ఉడికించి మెత్తగా రుబ్బి పెట్టుకున్న మటన్‌ను వేసి రెండు–మూడు నిమిషాలపాటు వేగనివ్వాలి. తరువాత గోధుమ రవ్వ, పప్పులన్నింటిని కలిపి గ్రైండ్‌ చేసిన ప్యూరీని వేసి బాగా కలుపుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం ఉడికేటప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఈ మిశ్రమం బాగా ఉడికి పైకి నెయ్యి తేలినప్పుడు దానిలో ఎర్రగా వేయించి పెట్టుకున్న ఉల్లిపాయలు, నిమ్మరసం వేసి కలిపితే హలీమ్‌ తయారైనట్లే. స్టవ్‌ ఆపేసి సన్నగా తరిగిన అల్లం ముక్కలు, కొత్తిమీర, పుదీనా, జీడిపప్పు పలుకులను పైన చల్లి వడ్డిస్తే  హలీమ్‌ చాలా రుచిగా ఉంటుంది.    

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading