కొండపల్లి బొమ్మలు
భారతదేశంలోనే గాక ప్రపంచవ్యాప్తంగా కొండపల్లి బొమ్మలు ప్రసిద్ధి చెందాయి. కొండపల్లి గ్రామం కృష్ణా జిల్లాలోని ఇబ్రహింపట్నం మండలంలో ఉన్నది. కొండపల్లి బొమ్మలు కొండపల్లి చుట్టుపక్కల అడవులలో దొరికే పొనికి అనే తేలికపాటి చెక్కనుండి తయారవుతాయి. కొండపల్లి కళాకారులు ఏకాగ్రతతో ఈ బొమ్మలు తయారు చేస్తారు. ముందుగా బొమ్మల విడిభాగాలు తయారు చేస్తారు. ఉదాహరణకు కాళ్లు, చేతులు, తల మొదలగు భాగాలను విడి విడిగా తయారుచేసి తరువాత వీటన్నిటినీ చింతగింజల పొడుంతో తయారు చేసిన బంకతో ఒకటిగా అంటిస్తారు.
You must be logged in to post a comment.