📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

About Me_Gardening

Orange Fruit Tree…కమలా పండ్ల చెట్లు

ఆరెంజ్ ఫ్రూట్ గా పిలువబడే కమాలా కాయలు సిట్రస్ జాతికి చెందిన Rutacea జాతికి చెందినవి. ఆరెంజ్ చెట్ల మూలం ఆఫ్రికా ఖంఢంలోని తూర్పు తీర ప్రాంతాలు.ఈ పండ్ల లోపల భాగం తొనలతో ఉండి జ్యూసీగా తీయగా పుల్లగా ఉంటాయి. వీటి మందమైన తోలు చర్మంలాగా ఉండి చక్కగా మెరుస్తూ ఉంటుంది. ఈ తొక్కల నుండి నూనెను తయారు చేస్తారు.ఈ చెట్లు 20 అడుగుల ఎత్తుదాకా పెరుగుతాయి. ఈ చెట్ల ఆకులు 365 రోజులు పచ్చగా ఉంటాయి.

Orange Fruit Tree…కమలా పండ్ల చెట్లు Read More »

Mango Trees…మామిడి చెట్లు

చిన్న పిల్లల నుండి పెద్దలు దాకా మామిడి పండ్లంటే ఇష్టపడని వారుండరు. మామిడి చెట్లను ప్రపంచమంతా పెంచుతున్నా కూడా ఇవి ఉష్ణమండల పంటలు. వీటి జన్మస్థలం తూర్పు ఆసియా, మయన్నార్, భారతదేశాలుగా చెబుతారు. మామిడి చెట్లు 50 నుంచి 60 అడుగుల ఎత్తు పెరుగుతుంది. మామిడి కాయలు సీజనల్ ఫ్రూట్స్ అనగా ఒక ప్రత్యేకమైన కాలం(వేసవి కాలం) లో మాత్రమే లభిస్తాయి(సుమారుగా ఏప్రియల్ నెల నుండి జులై నెల వరకు)మామిడి కాయలలో అనేక రకాలున్నాయి. బంగినిపల్లి, పెద్ద

Mango Trees…మామిడి చెట్లు Read More »

Lemon Tree…నిమ్మకాయ చెట్టు

నిమ్మ పుట్టిల్లు దక్షిణ ఆసియా. కానీ ఇండోనేషియా, భారత దేశంలోని అసోంలో మొదటిసారిగా పండించారని చెబుతారు. ఆ తర్వాత ప్రపంచమంతా వ్యాప్తి చెందాయి.ప్రస్తుతం నిమ్మను ఎక్కువగా మెక్సికోలో పండిస్తున్నారు. ఆ తరువాత భారత్ చైనా, అర్జెంటీనా, బ్రెజిల్ దేశాలలో నిమ్మను ఎక్కువగా పండిస్తున్నారునిమ్మ చెట్టు దాదాపు 16 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. పొదలా ఉండే చిన్నపాటి చెట్టు ఇది. నిమ్మ ఆకులు ముదురు ఆకుపచ్చ రంగులో ఉండి అంచుల్లో కాస్త వంకర తిరిగి కనిపిస్తాయి. నిమ్మ

Lemon Tree…నిమ్మకాయ చెట్టు Read More »

Guava Trees….జామచెట్లు

జామ చెట్లు ఉష్ణమండలానికి చెందిన చెట్లు. ప్రపంచమంతా జామను పండిస్తున్నా వీటి జన్మస్థలం అమెరికాలోని ఉష్ణమండల ప్రాంతం. ఇవి మిర్టాసియా కుటుంబానికి చెందినవి. జామ చెట్లను విత్తనాలు మరియు గ్రాఫ్టింగ్ పద్ధతుల ద్వారా పెంచుతారు. జామ కాయలను నేరుగా తినటానికే కాక జెల్లీలు, జామ్ తయారీలో కూడా వాడతారు.జామ ఆకులు పచ్చగా సుమారుగా ఒకటి నుండి మూడు అంగుళాల వెడల్పుతో ఉంటాయి. వీటిపూలు చాలా చిన్నగా ఉంటాయి. తెల్లగా నాలుగు రేకలతో ఉంటాయి. ఈ పూలే జాయకాయలుగా

Guava Trees….జామచెట్లు Read More »

Goose Berry Tree …ఉసిరి చెట్టు

ఉసిరి చెట్లు ప్రపంచంలో చాలా ప్రాంతాలలో పెరుగుతాయి. అయితే ఇండోనేషియా… ఉసిరి చెట్లను ఎక్కువగా పెంచే దేశాల్లో మొదటిస్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండియా, ఫిలిప్పీన్స్ దేశాల్లో ఈ చెట్లను ఎక్కువగా పెంచుతారు.ఉసిరి చెట్లలోచాలా రకాలు ఉన్నాయి . ఎక్కువగా బలవంత్ నీలమ్ అమ్రిత్ కాంచన్ కృష్ణ, చక్కియా, బనారసి ఉసిరి జాతుల్ని పెంచుతుంటారు. ఉసిరి కాయలలో రెండు రకాలున్నాయి. చిన్న చిన్న కాయలను తినే ఉసిరి అంటారు. వీటిని పిల్లలు, పెద్దలు ఉప్పు, కారం అద్దుకుని

Goose Berry Tree …ఉసిరి చెట్టు Read More »

Dates Tree….ఖర్జూరం

ఖర్జూరం చెట్టు నాటినప్పటి నుండి మూడవ సంవత్సరం నుండి దిగుబడి మొదలవుతుంది. గాలిలో తేమ తక్కువగా ఉండే ఉష్టప్రాంతాలలోని అన్నిరకాల నేలలోనూ ఈ చెట్లు ఎదుగుతాయి. Arecaceae చెట్ల జాతికి చెందినదిఖర్జూర పంటకు చీడపీడలు తక్కువే. ఒకో చెట్టుకు 300 నుంచి 500 వందల కిలోల దాకా దిగుబడి వస్తుంది. ఈ చెట్లు 75 అడుగుల దాకా ఎదుగుతుంది. ఈ చెట్ల జీవితకాలం 150 సంవత్సరాలు అంటారు. ఈ చెట్టులోని ప్రతిభాగం విలువైనదే. కాండంను కలపగా వాడతారు.

Dates Tree….ఖర్జూరం Read More »

Custard Apple….(సీతాఫలం )

శీతకాలంతో పాటు సీతాఫలం పండ్లు కూడా వస్తాయి. సీతాఫలాలను షుగర్ యాపిల్, కస్టర్డ్ యాపిల్ అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయ నామం అన్నోనా స్క్వామోసా. అనోనేసి కుటుంబానికి చెందినవి. ప్రపంచంలో చాలా ప్రాంతాల్లోనే ఈ చెట్లు పెరుగుతాయి. రకరకాల ఇసుక నేలలలోనూ, కొండప్రాంతాలలోనూ ఈ చెట్లు పెరుగుతాయి. దక్షిణ అమెరికా దేశాలతో పాటు భారతదేశంలోనూ ఎక్కువగా ఈ చెట్లు ఎక్కువగా ఉన్నాయి.ఈ చెట్లకు చిన్న చిన్న కొమ్మలుంటాయి. సుమారు 10 నుంచి 26 అడుగుల ఎత్తు

Custard Apple….(సీతాఫలం ) Read More »

Coco Nut Trees….కొబ్బరి చెట్లు

కొబ్బరి చెట్లలో రెండు రకాలున్నాయి. మొదటిది పొట్టిరకం చెట్లు. రెండవవి పొడుగు చెట్లు. కొబ్బరి చెట్లు నాటిన 5 సంవత్సరాల నుండి 6 సంవత్సరాలలో కొబ్బరి కాయలు కాయటం మొదలవుతుంది. ఒక్కో కొబ్బరి చెట్టుకు 50 నుండి 100 కాయల వరకు దిగుబడి ఉంటుంది.కొబ్బరి చెట్లు ఉష్ణమండలపు చెట్లు. ఎండ ఎక్కువగా తగిలే ప్రదేశాలలో ఎక్కువగా పెరుగుతాయి. పొడుగు కొబ్బరి చెట్లు 80 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. ఇసుక నేలలోనూ, సముద్రతీర ప్రాంతాలలోనూ, అన్నిరకాల నేలలోనూ

Coco Nut Trees….కొబ్బరి చెట్లు Read More »

Cahew Apple Tree.. … జీడి చెట్టు

జీడి చెట్ల జన్మస్థానం బ్రెజిల్ దేశం. 16వ శతాబ్ధంలో పోర్చుగీసు నావికుల ద్వారా తూర్పు ఆఫ్రికా మరియు భారతదేశానికి తేబడ్డాయి. ప్రస్తుతం వీటిని వ్యాపార పరంగా బ్రెజిల్, భారతదేశాలలో ఎక్కువగా ఈ చెట్లను పెంచుతున్నారు. జీడి చెట్లు సుమారు 40 అడుగుల ఎత్తువరకు పెరుగుతాయి. ఈ చెట్లు ఎక్కువగా సముద్రతీరాలలోనూ, ఇసుక నేలలోనూ పెరుగుతాయి.అత్యధికంగా ప్రొటీన్లు గల జీడి పప్పును నేరుగా తినవచ్చు. మాంసాహార, శాఖాహార వంటకాలలో ఉపయోగిస్తారు. జీడి చెట్లనుండి జీడికాయలు కాస్తాయి. ఈ జీడికాయల

Cahew Apple Tree.. … జీడి చెట్టు Read More »

Black Plum Tree….నేరేడు చెట్టు

నేరేడు చెట్టుకు గిన్నె చెట్టు అనే మరో పేరూ ఉంది. ఇంగ్లీషు భాషలో మలబార్‌ ప్లమ్‌, జావా ప్లమ్‌, బ్లాక్‌ ప్లమ్‌.. అంటూ అంటారు. ఈ చెట్లను ఎక్కువగా పండ్ల కోసమే పెంచుకుంటారు.నేరేడు చెట్టు శాస్త్రీయ నామం షైజీజియం క్యుమిని. ఇంకా మిర్టేసి కుటుంబానికి చెందినది. ఉష్ణ మండల ప్రాంతాల్లో ఈ చెట్లు పెరుగుతాయి. భారత్ తోపాటు శ్రీలంక, పాకిస్థాన్ ఇండోనేషియాల్లో ఎక్కువగా పెరుగుతాయి. ఇంకా ఫిలిప్పీన్స్ మయన్మార్ ఆస్ట్రేలియా, ఫిజి, చైనాలోనూ కొద్దిగా ఈ చెట్లు

Black Plum Tree….నేరేడు చెట్టు Read More »

Banana Plants…అరటి మొక్కలు

సాధారణంగా అరటి మొక్కను అరటి చెట్టు అంటారు. కానీ ఇది చెట్టు కాదు. ఒక రకంగా మొక్కే. ఈ మొక్కకు ప్రత్యేకంగా కాండం అంటూ ఉండదు! ఆకుల భాగాలే పొరలుపొరలుగా కలిసిపోయి కాండంగా మారతాయి. అరటి శాస్త్రీయ నామం… మూసా అక్యునిమిటా(అడవి అరటి). అరటి పండ్లను సంస్కృతంలో రంభాఫలం, కదలీఫలం అనీ హిందీలో ఖేలా, ఇంగ్లిష్ లో బనానా అంటారు.అరటి మొక్కలు సాధారణంగా.. 10 నుంచి 20 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి.. వీటికి సీజన్ అంటూ

Banana Plants…అరటి మొక్కలు Read More »

ఆవకాడో చెట్టు

అవకాడో పండును వెన్నపండు, అలగేటర్పియర్ అని కూడా అంటారు. ఈ పండు జన్మస్థానం మధ్య మెక్సికో ప్రాంతం. ఈ పండు శాస్త్రీయ నామం పెర్సీ అమెరికానా.. ఈ చెట్టు సుమారు 66 అడుగుల ఎత్తు పెరుగుతుంది. అవకాడో చెట్లు సారవంతమైన ఎర్రనేలల్లో పెరుగుతాయి. ఈ పండ్లను క్రీస్తుపూర్వం 10 వేల సంవత్సరాల నుంచే తింటున్నారు. భారతదేశంలో దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడా.. ఇప్పుడిప్పుడే ఈ చెట్లను పెంచుతున్నారు విత్తనం నాటిన 4 నుంచి 6 సంవత్సరాలకు కాయలు కాస్తాయి

ఆవకాడో చెట్టు Read More »

Almond Tree…బాదం చెట్లు

బాదం చెట్లు 13 నుంచి 33 అడుగుల ఎత్తు వరకు పెరుగుతాయి. వీటి జీవిత కాలం సుమారు 25 సంవత్సరాలు. బాదం ఆకులు మూడు నుంచి ఐదు అంగుళాల పొడవు ఉంటాయి. ఈ చెట్లకు సూర్యరశ్మి, నీళ్లు ఎక్కువగా కావాలి. ఇసుక, బంకమట్టి నేలలో పెరుగుతాయి.ఆంగ్లంలో ఆల్మండ్ ట్రీ అంటారు . ఈ చెట్లు రోసేసి కుటుంబానికి చెందినవి. ప్రునస్ డల్సిస్ ఈ చెట్ల శాస్త్రీయ నామం. ఇవి ఎక్కువగా మధ్య ఆసియా దేశాల్లో పెరుగుతాయి. తరువాత

Almond Tree…బాదం చెట్లు Read More »

Tomoto -టొమాటోలు

టొమాటోలో పోషకాలు ఎక్కువ. గుండె జబ్బులూ, క్యాన్సర్ను నిరోధించే లైకోపిన్ అధికం. విటమిన్లు – బి, సి, కె లతోపాటు పొటాషియం కూడా ఎక్కువే. కొలెస్ట్రాల్ను తగ్గించడం, రక్తప్రసరణను క్రమబద్ధం చేయడం, మూత్రపిండాలను సంరక్షించడం… లాంటి ఎన్నో ప్రయోజనాలు దీనివల్ల కలుగుతాయి.ప్రపంచంలో అత్యధికంగా సాగులో ఉన్న కూరగాయల్లో అధిక పోషకాలున్న కూరగాయ టొమాటో. దీని శాస్త్రీయ నామం లైకోపెర్సికమ్ ఎస్క్యులెంటమ్. అధిక వర్షాలూ, అత్యధిక ఉష్ణోగ్రతలు టొమాటో పండించడానికి ఆటంకాలైనా… ఈ పరిస్థితులను తట్టుకునే రకాల రూపకల్పన

Tomoto -టొమాటోలు Read More »

Snake Gourd ,Bottle Gourd, Ridge Gourd పొట్ల..సొర…బీర..కాకర

ఎక్కువ కెలొరీలూ, ఎక్కువ విటమిన్లూ, ఖనిజ లవణాలతో ఆరోగ్యానికి మారుపేరు పందిరి కూరగాయలు. ఇవి సులువుగా జీర్ణమవుతాయి. పైగా శరీరానికి చల్లదనం కూడా. పందిరి కూరగాయల్లో ముఖ్యమైనవి సొరా, బీరా, పొట్లకాయా, కాకర. వీటిని అన్ని కాలాల్లో పెంచుకోవచ్చు. కుండీల్లోనూ నాటుకోవచ్చు. వీటికి పందిరి లేదా జాలీ వంటి సరైన ఆధారం ఇవ్వగలిగితే పెంచుకోవడం సులువే. ఈ పాదులకు ఆరేడు గంటలపాటు ఎండా, సారవంతమైన మట్టి మిశ్రమం అవసరం. వీటిని పెంచే కుండీలు అడుగున్నర లోతూ, పెంచుకునే

Snake Gourd ,Bottle Gourd, Ridge Gourd పొట్ల..సొర…బీర..కాకర Read More »

Pumpkin – గుమ్మడి కాయ

గుమ్మడి కాయని చాలామంది కూరగాయ అనే దృష్టితోనే చూడరు. కానీ ప్రపంచంలో గుమ్మడిని అధికంగా పండించే దేశాల్లో చైనా తరువాత స్థానం మనదే! గుమ్మడిలో చాలా రకాలున్నాయి. రకరకాల ఆకారాల్లో, పరిమాణాల్లో, గోధుమా, ఆకుపచ్చ రంగుల్లో లభిస్తుంది. మనం ఎక్కువగా పులుసూ, కూర చేసుకుంటాం. అయితే ప్రపంచవ్యాప్తంగా దీంతో ఎన్నో రకాల స్వీట్లూ, కేకులూ, ఇతర బేకింగ్‌ పదార్థాలూ, పానీయాలు తయారు చేస్తారు. విదేశాల్లో హాలోవీన్‌ పండగకు ముఖ్య అలంకరణ దీంతోనే.గుమ్మడిలో పోషకాలూ, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా

Pumpkin – గుమ్మడి కాయ Read More »

Chillies – మిరప కాయలు

మిరపను సంవత్సరం పొడవునా పెంచుకోవచ్చు. కుండీలోనూ చక్కగా పెరుగుతాయివి. ఒకవేళ అవసరానికి మించి కాసినా వృథా అయిపోవు. కోయడం కొంచెం ఆలస్యమైతే ముదిరి, పనికి రాకుండా పోతాయనే భయం లేదు. పచ్చిమిర్చిగా కాకుంటే పండు మిరప, ఆ తరువాత ఎండుమిర్చిలా హాయిగా వాడుకోవచ్చు.మిరప అనగానే ఘాటే గుర్తుకొస్తుంది కానీ ఆ ఘాటుకు కారణం వాటిలో ఉండే ‘క్యాప్సిసిన్‌’ అనే రసాయనమే. దీన్ని చాలా ఔషధాల్లో వాడతారు. మనకు మిర్చి అంటే కారం కోసం అనుకుంటాం కానీ అది

Chillies – మిరప కాయలు Read More »

Micro Greens…చిట్టిమొక్కలు

కేవలం రెండు, మూడు వారాలలోనే పంట దిగుబడి అందించేవి మైక్రోగ్రీన్స్. అని రకాల మొక్కలను మైక్రో గ్రీన్స్ గా పెంచవచ్చు. అయితే ఎక్కువగా ఆవకూర, ఎర్రతోటకూర, క్యాబేజీ, ముల్లంగి, బీట్ రూట్, తెల్లముల్లంగి, ఉల్లి రకాలను ఎక్కువగా పెంచుతున్నారు.కొద్దిపాటి స్థలం ఉంటే మైక్రోగ్రీన్స్ ను పెంచవచ్చు. ఏదైనా కంటైనర్, మట్టి, విత్తనాలు ఉంటే చాలు. నాటిన పదిహేను రోజులలోనే చిట్టిమొక్కలు వస్తాయి. అయితే వీటికి గాలి, వెలుతురు తప్పనిసరి కాబట్టి డాబాల మీద పెంచుకోవచ్చు.వీటిని మూడు, నాలుగు

Micro Greens…చిట్టిమొక్కలు Read More »

Yam Growing….చేమదుంపల సాగు

దుంపజాతికి చెందిన అధిక పోషకాలుండే కూరగాయల్లో చేమదుంప (చేమగడ్డ) ప్రముఖంగా చెప్పొచ్చు. సాధారణంగా దుంపల్లో పిండిపదార్థాలు ఎక్కువ. దాంతో బరువు పెరుగుతామనుకుంటాం. కానీ చేమదుంపలో పీచు అధికంగా ఉండటంతో బరువు తగ్గడం కూడా సులువే.చేమదుంపను ఆర్వి, టారో, ఎలిఫెంట్‌ ఇయర్‌ అని రకరకాలుగా పిలుస్తారు. మూడు అడుగుల ఎత్తు పెరిగే ఈ మొక్క లేతాకు పచ్చరంగులో ఉండే పెద్దపెద్ద ఆకులతో అలంకరణ మొక్కలా కనిపిస్తుంది. ఎండతోపాటు కొద్దిపాటి నీడ ఉన్నా చేమదుంపను చక్కగా నాటుకోవచ్చు. లావుగా, గుండ్రంగా

Yam Growing….చేమదుంపల సాగు Read More »

Brinjal – వంకాయలు

మరీ చల్లని ప్రాంతాల్లో తప్ప ప్రపంచమంతటా విరివిగా పండే వంకాయ శాస్త్రీయ నామం సొలానమ్‌ మెలాంజినా. బ్రింజాల్‌ అనే పేరు మనదేశంలో ఎక్కువగా వాడుకలో ఉంది. అబర్‌గెన్‌ అన్నా ఇదే. దీన్ని ఎగ్‌ ప్లాంట్‌ అనీ అంటారు. ఒక రకం వంకాయలు తెల్లగా, అండాకారంలో అచ్చంగా కోడిగుడ్లు మొక్కకు వేలాడుతున్నాయా అన్నట్లు ఉంటాయి మరి. మనదేశంలో ఎన్నో రకాల వంకాయలు – రంగూ, ఆకారం, పరిమాణం, ప్రాంతం, అభిరుచిని బట్టి ఎవరి ఎంపిక వారిదే. అలాగే కొన్ని

Brinjal – వంకాయలు Read More »

బ్రకోలి

పోషక విలువల్లో ప్రథమస్థానంలోనూ, రుచికీ, ఆరోగ్యానికీ మారుపేరుగా ఉండే కూరగాయల కోసం వెతికే వారికి మొదటి ఎంపిక బ్రకోలి. దీని శాస్త్రీయ నామం బ్రాసికా ఒలరేషియా ఇటాలికా. క్యాబేజీ కుటుంబానికి చెందిన ఈ కూరగాయను ఒకసారి రుచి చూసినవాళ్లెవ్వరూ మరిక వదలరు. ఇంతకు ముందు ఎక్కడో తప్ప దొరకని ఈ కూరగాయ ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో సులువుగా దొరుకుతోంది. అంటే దీన్ని మనం కూడా పెంచుకోవచ్చన్నమాట.బ్రకోలీ రుచికరమైందే కాకుండా పోషకాలకూ, ఔషధ గుణాలకూ సాటిలేనిది కూడా. రొమ్మూ,

బ్రకోలి Read More »

Ladies Fingers….. Okra… బెండకాయలు

బెండకాయలను పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకూ అందరూ ఇష్టపడతారు. తక్కువ కెలొరీలూ, ఎక్కువ పోషకాలతో ఉండే బెండ క్రమం తప్పకుండా తినాల్సిన కూరగాయ. ఇంట్లో పెంచుకుంటే తాజాగా, లేతగా, పురుగు మందులు లేని రుచికరమైన బెండకాయలు సొంతమవుతాయి.బెండకాయను లేడీస్‌ ఫింగర్‌ అనే కాదు, ఓక్రా అనీ అంటారు. ఇది గోంగూర కుటుంబానికి చెందింది. బెండను ఏడాది పొడవునా పండించుకోవచ్చు. దీనికి ఎండ బాగా కావాలి. కనీసం 5-6 గంటలన్నా ఎండ పడేలా చూసుకోవాలి. బలంగా పెరిగే

Ladies Fingers….. Okra… బెండకాయలు Read More »

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద సీతాకోక చిలుకలకు ప్రియనేస్తం…స్వచ్ఛమైన లేత గులాబీ రంగు పూలతో విభిన్నంగా, మనోహరంగా కనిపించే పొద గులాబీ గరుడవర్థనం. దీన్ని గులాబీ కాప్సియా అనీ, బిళ్లగన్నేరు పొద అనీ అంటారు. దీని శాస్త్రీయనామం కాప్సియా ఫ్రూటీకోజా లేదా సెర్బెరా ఫ్రూట్‌కోజా.గులాబీ గరుడవర్థనం నెమ్మదిగా పెరిగే పెద్దపొద. సుమారు పది అడుగుల ఎత్తు వరకూ పెరుగుతుంది. గుబురుగా కాకుండా వ్యాపించినట్లుండే కొమ్మలతో ఉంటుంది. దీని ఆకులు కోలగా, లేతాకుపచ్చరంగులో ప్రస్ఫుటంగా కనిపించే ఈనెలతో

Fruity Koja Flowers…… బిళ్లగన్నేరు పొద Read More »

సొగసరి సాల్వియా

సొగసరి సాల్వియా వర్షాకాలపు ఆహ్లాదకరమైన వాతావరణానికి ప్రకాశవంతమైన రంగుల సొగసుని జోడించే మొక్కల్లో ఎర్రసాల్వియా ప్రధానమైనది. ఎర్ర సాల్వియా శాస్త్రీయనామం సాల్వియా స్పెండెన్స్‌. అడుగు నుంచి రెండడుగుల ఎత్తువరకూ పెరిగే ఈ మొక్కను అన్ని రుతువుల్లోనూ నాటుకోవచ్చు.సీజనల్‌ మొక్కలో ఎక్కువకాలం పూసే మొక్క ఇది. కొన్ని ప్రాంతాల్లో బహువార్షికంగానూ పెరుగుతుంది. ప్రకాశవంతమైన ఆకుపచ్చని ఆకులు, మురిపించేఎరుపు రంగులో కంకుల్లో పూసే పూలతో సాల్వియా కనువిందు చేస్తుంది. బాగా వెలుతురులో పెరిగే ఈ మొక్క కొద్దిపాటి నీడలోనూ చక్కగా

సొగసరి సాల్వియా Read More »

డిసెంబరాలు

డిసెంబరాలు డిసెంబరాలు ఊదా, లావెండర్ రంగులలో ఊదా తెలుపు చారలతో ఉండే నాజూకైన పూలతో సంక్రాంతి సమయంలో విరగబూసే డిసెంబరాలు తెలియని తెలుగు ఆడపడుచులుండరేమో. వీటిని గొబ్బిపూలు, పెద్దగోరింట అని కూడా అంటారు. ఫిలిఫైన్స్ వయోలెట్, బ్లూబెల్, బర్లేరియా అని కూడా పిలుస్తారు. వీటి శాస్త్రీయనామం బర్లేరియా క్రిస్టేటా. డిసెంబరాల జన్మస్థానం మనదేశమే. పల్లెటూళ్లలో ఇళ్లముందు రోడ్లపక్కగా ఎక్కువగా కనిపించే మొక్కలు ఇవి. ఈ పూలను ఎక్కువగా మాలలు కట్టి జడలో అంకరించుకోవడానికి, దేవుడికి అర్పించడానికీ వాడతారు.

డిసెంబరాలు Read More »

Firespike……అగ్నిశిఖ

అగ్నిశిఖ మెరిసే నిండాకుపచ్చరంగులో సున్నితమైన పెద్ద పెద్ద ఆకులతో ప్రకాశవంతమైన పండుమిరప ఎరుపు రంగులో కంకుల్లో పూసే గొట్టాలాంటి సన్నని పూలతో లాంటి స్థలాన్నైనా వర్ణభరితం చేయగల మొక్కలే అగ్నిశిఖ ఒకటి. దీని శాస్త్రీయనామం బడాంటోనియా లాంగిఫోలియం లేదా జస్టీషియా ట్యూబిఫార్మస్ . దీన్ని ఫైర్ స్పైక్ అని, స్కార్లెట్ ఫ్లేమ్ అనికూడా అంటారు.అగ్నశిఖ లేత కొమ్మలతో మూడు నుంచి నాలుగు అడుగల ఎత్తువరకు పెరిగే బహువార్షికం. సరైన మట్టిమిశ్రమంలో ఒకసారి నాటితే తర్వాత అట్టే పట్టించుకోనవసరం

Firespike……అగ్నిశిఖ Read More »

కోలియస్

రకరకాల వర్ణాల్లో, వర్ణమిశ్రమాలతో, అలరారే ఆకులుండే జాతి కోలియస్. ప్రకృతి శ్రద్ధతో గీసిన వర్ణచిత్రాల్లా మనోహరంగా ఉండే మొక్కలజాతి ఇది. దీని శాస్త్రీయనామం కోలియన్ బ్లూమివివిధ ప్రత్యేక వర్ణాల్లోనూ, బోలెడు రంగులతో హోలీ ఆడినట్టు గీతలు గీసినట్లు అంచులు వైవిధ్యంగా ఈనెలు వేరే వర్ణంలో ప్రస్పుటంగా ఇలా ఎన్నెన్నో సొగసులతో….లేత పసుపు మొదలుకుని ముదురు చాక్లెట్ రంగువరకూ…. ఇన్ని వన్నె చిన్నెలు ప్రదర్శించగల మొక్క ఇది ఒక్కటేమోనేమో. అలాగే ఆకుల ఆకారం, పరిమాణంలో కూడా ఎంతో వైవిధ్యం

కోలియస్ Read More »

జాకోబినియా

నీడలో కూడా అతితక్కువ అందమైనే పూలతో కనువిందుచేయగల అతితక్కువ రకాలలో జాకోబినాయా కూడా ఒకటి. మన ప్రాంతానికి అనువైన మొక్క ఇది. జాకోబినియాను బ్రెజీలియన్ ఫ్లూమ్ అని కూడా అంటారు. దీని శాస్త్రీయనామం జస్తీషియా కార్నియా. ఇది నీడలో పెరిగే చిన్నపొద. రెండు నుండి మూడు అడుగుల ఎత్తువరకూ పెరుగుతుంది.అండాకారంలో ఉండే పెద్ద పెద్ద ఆకులతో ఎప్పుడూ పచ్చగా ఉంటుంది. కంకులవంటి పూల గుత్తులు, ఆకర్షణీయమైన తెలుపు, లేత గులాబీ, నిండుగులాబీ, పసుపువంటి రంగులతో ముచ్చటగా ఆకట్టుకుంటాయి.

జాకోబినియా Read More »

గడ్డిగులాబి

పోర్చులక, నాచుమొక్క, గడ్డిగులాబి….. ఈ మొక్కలు ఎలాంటి ల్యాండ్ స్కేప్ లోనైనా అత్యంత సహజంగా పెరిగి అందరినీ ఆకట్టుకొంటుంది. దీన్నే సన్ రోజ్ మాస్ రోజ్ అనికూడా అంటారు. ఈ మొక్కలు పూర్తిగా సూర్యకాంతిలో పెరుగుతాయి. గడ్డిగులాబీ శాస్త్రీయనామం పోర్చులక. వీటిలో గ్రాండీఫ్లోరా. ఒలరేషియా రకాలుంటాయి. గ్రాండీఫ్లోరా ఆకులు సన్నగా సూదుల్లాగా ఉంటాయి. ఒలరేషియా ఆకులు కొంచెం కోలగా ఉంటాయి. ఒలరేషియా ఆకులను సలాడ్లలో కూడా వాడతారు. వీటి గింజలను కూడా సలాడ్లలో సూపులలో వాడతారు. మనం ఆకుకూరగా

గడ్డిగులాబి Read More »

ముచ్చటైన మోండోగ్రాస్

ఎలాంటి ల్యాండ్ స్కేప్ లో అయినా సులువుగా ఇమిడిపోయి అదనపు ఆకర్షణను అందించే మోండోగ్రాస్….. మోండోగ్రాస్ ఎలాంటి నేలలో అయినా మూడునుండి ఆరు అంగుళాల ఎత్తుమాత్రమే పెరుగుతుంది. ఇది ఎప్పుడూ పచ్చగా ఉండే బహువార్షికం. ఇది కాడలు లేని నిండాకుపచ్చ రంగు గడ్డిలాంటి ఆకులతో కుదురులా పెరుగుతుంది. ఇది పెద్దగా శ్రద్ధ చూపనవసరం లేకుండా సులువుగా పెరిగే మొక్క.మోండోగ్రాస్ ఎలాంటి నేలల్లో ఐనా పెరుగుతుంది. కానీ నీళ్లు నిలవకుండా ఉంటే చాలు. ఎండను తట్టుకున్నా నీడ దీనికి

ముచ్చటైన మోండోగ్రాస్ Read More »

↑
Scroll to Top