అమిత్ షాకేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆదివారం (ఆగస్టు 2) ఆయనే స్వయంగా వెల్లడించారు. కరోనా లక్షణాలుగా అనుమానించి పరీక్షలు నిర్వహించుకోవడంతో తనకు పాజిటివ్‌గా తేలిందని ట్వీట్ చేశారు. ఆస్పత్రిలో అడ్మిట్ అయినట్లు తెలిపారు. తనను కలిసిన వారందరినీ అలర్ట్ చేశారు. ‘కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయించుకున్నాను. ఫలితాల్లో పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, డాక్టర్ల సలహా మేరకు ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యాను. గత కొద్ది రోజులుగా నన్ను కలిసిన వారందరూ పరీక్షలు చేయించుకోవాలి, సెల్ఫ్ క్వారంటైన్‌లో ఉండాల్సిందిగా కోరుతున్నాను’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.