📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

స్క్రిప్ట్ రైటర్ అవ్వడం ఎలా..?


నైపుణ్యం ఇందులో ప్రధానం. అయితే చాలామంది తల్లిదండ్రులు పిల్లల్ని ఇటువంటి ప్రోత్సహించరు. అది తప్పు. ఎందుకంటే ఇప్పుడు చాలా కోర్సులు వచ్చాయి. అంతే కాకుండా వాటి తో పాటు అనేక అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అన్ని రంగా ల్లోనూ ఉద్యోగాలు కూడా వస్తున్నాయి ఇందులో ఏ మాత్రం భయం లేదు. ఎందుకంటే ఇది ఆండ్రాయిడ్ యుగం. ఈ ఆండ్రాయిడ్ యుగం లో బాగా స్మార్ట్ ఫోన్లో అనేక రకాల వెబ్ సైట్లు ఆప్స్ ఇలా ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ యొక్క అభిరుచిని దీనిలో అభివృద్ధి చేసుకోవచ్చు..

చక్కటి టాలెంట్ ఉంటే సరిపోతుంది. అవకాశాలు వాటంతట అవే వస్తాయి. కష్టపడుతూ ఉంటే దీనికి అవకాశం తప్పక వస్తుంది. అయితే మన ఇండియాలో స్క్రిప్ట్ రైటర్ అవ్వాలంటే ఏం చేయాలి…?

ముందు సినిమాల వైపు అలానే జరుగుతున్న సామాజిక విషయాలపై అవగాహన ఉండాలి సామాజిక అంశాల పై కథలు కింద మారితే అది నిజంగా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైనా నిత్యం జరిగే వాటిని యాక్సెప్ట్ చేయగలరు కానీ ఊహా ప్రపంచం లో తీసుకువచ్చి చూపించడం వల్ల కొన్ని అపోహలు అనేవి కలుగుతాయి ఏది ఏమైనా సరే మన చుట్టూ జరిగే అంశమే కథలు అవ్వచ్చు.

కాబట్టి మీరు జరిగే వాటిని గమనిస్తూ వాటిపై కాస్త అవగాహన కలిగించుకుని కథ రాయడం మొదలు పెట్టండి అప్పుడు ఆ కథని రిజిస్టర్ చేసుకోండి ఎవరికైతే డైరెక్షన్ లో ఆసక్తి ఉందో వాళ్లని పట్టుకోవడానికి ప్రయత్నించండి. ఒకవేళ కనుక ఆ స్క్రిప్ట్ ని డైరెక్టర్ రద్దు చేస్తే మరోసారి ప్రయత్నించండి ఏదో ఒకరోజు మీ కదా డైరెక్టర్ కి నచ్చుతుంది ఇందులో ఎప్పుడూ నిరాశ పడకూడదు ఎందుకంటే అది సులువుగా రాదు అలానే ప్రతి ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉండవు కాబట్టి కష్టపడడం మీ తత్వం గా చేసుకుని మీ కథని మీరు ఇంకా అభివృద్ధి చేసుకుంటూ జీవితంలోకి పైకి వెళ్ళండి తప్పక అవకాశం నీకు దక్కుతుంది.

రాయడం దానిని మళ్ళీ చదవడం మళ్ళీ తిరిగి రాయడం వంటివి ఇందులో ముఖ్యం. ఒకసారి మీ ఆలోచనలు ఒక సినిమా కోసం పెడితే ఆలోచనల తో రాస్తూ ఉండండి మీరు ఆ స్క్రిప్టుని బ్లూ ప్రింట్ తీసుకోండి. అలా స్క్రిప్ట్ని బాగా డెవలప్ చేసుకుంటూ వెళ్ళండి. హీరో విలన్ , హీరో విలన్ మధ్య గొడవలు ఇలాంటివి ప్రతిదీ కూడా జాగ్రత్తగా నిర్మించుకోండి. ఇలా మీరు కథలు రాయడం నేర్చుకోవాలి. ఒకవేళ కనుక మీరు కథలు రాయడం లో బాగా కష్టపడుతుంటే లేకపోతే ఆలోచనలు త్వరగా రాకపోయినా సరిగా రాయలేక పోతున్న సీనియర్ ఎవరైనా ఉంటే సంప్రదించవచ్చు.

అలాంటప్పుడు వారి యొక్క అనుభవాలు అన్నీ మీకు చెప్తూ మిమ్మల్ని ప్రోత్సహించే అవకాశం ఉంది స్క్రీన్ రైటర్ కనుక అవ్వాలంటే స్క్రీన్ రైటర్ కోర్సు ఉంది. స్క్రీన్ రైటర్ కోర్సు మొత్తం మూడు సంవత్సరాలు. ఫిలిం డైరెక్షన్ పైన అందులో నేర్పిస్తారు. అనేక ఇన్స్టిట్యూట్లు స్క్రీన్ రైటింగ్ కోర్స్ అందిస్తోంది.

ముంబైలో అలానే పూణేలో ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా లో కూడా నేర్పిస్తారు ముంబైలో సెన్స్ ఇండియా ఫౌండేషన్ కూడా స్క్రీన్ లైటింగ్ కోర్సును అందిస్తోంది అలానే ముంబైలోనే మైండ్ స్క్రీన్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది ఇతర దేశాల్లో యూఎస్ఏ, లండన్ ఇంగ్లాండ్ లో కూడా స్క్రీన్ కోర్సులు ఉన్నాయి. కాబట్టి మీరు కూడా ఆసక్తిగా ఉంటే అక్కడికి వెళ్లి మీరు నేర్చుకోవచ్చు.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading