|
వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ.. డిమాండ్ ఉన్న కోర్సు! ప్రస్తుతం జాతీయంగా, అంతర్జాతీయంగా పశువైద్యులకు కొరత నెలకొంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో వెటర్నరీ డాక్టర్ల సేవల అవసరం రోజురోజుకూ పెరుగుతోంది.
|
|
డెయిరీ, పౌల్ట్రీ రంగాలతోపాటు పెట్‌లు, యానిమల్ హెల్త్‌కేర్‌కు ప్రాధాన్యం పెరగడమే ఇందుకు కారణం! మరోవైపు పెంపుడు జంతువుల ఆరోగ్యంపై ఎన్నడూ లేనంత శ్రద్ధ కనిపిస్తోంది. ఇదే ఇప్పుడు వెటర్నరీ రంగంలో చక్కటి కెరీర్ అవకాశాలకు మార్గం వేస్తోంది. ఈ నేపథ్యంలో.. వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ విభాగంలో కోర్సులు, కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం…
‘వెటర్నరీ సైన్స్ చదివితే.. పశు వైద్యులుగానే స్థిర పడతాం. అవకాశాలు కూడా తక్కువే. ప్రభుత్వ పశువైద్యశాలల్లో మాత్రమే కొలువులు దొరుకుతాయి’-ఇదీ గతంలో వెటర్నరీ సైన్స్ కోర్సుపై నెలకొన్న అభిప్రాయం. కానీ ఇప్పుడు దీనికి భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. వెటర్నరీ సైన్స్ చదివిన అభ్యర్థులు పశు వైద్యులుగానే కాకుండా.. పలు అనుబంధ విభాగాల్లోనూ కొలువులు సొంతం చేసుకునేందుకు వీలుంది. ఇటీవల కాలంలో పెంపుడు జంతువుల పట్ల వ్యక్తుల్లో ఆసక్తి పెరగడం, అవి అనారోగ్యానికి గురైతే ఖర్చు గురించి ఆలోచించకుండా.. పశువైద్యుల దగ్గరకు తీసుకెళ్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో వెటర్నరీ హెల్త్‌కేర్ మార్కెట్ శరవేగంగా వృద్ధి చెందుతోంది. ఏటా పదిశాతం వృద్ధి రేటు నమోదు చేసుకుంటోంది. దేశ వెటర్నరీ హెల్త్‌కేర్ మార్కెట్ 2024 నాటికి 1.17 బిలియన్ డాలర్లకు చేరుకోనుందని ట్రాన్స్‌పరెన్సీ మార్కెట్ రీసెర్చ్ తాజా నివేదికలో వెల్లడైంది. పశువైద్యుల కొరత :పలు గణాంకాల ప్రకారం- దేశంలో ప్రస్తుతం దాదాపు 1.8 లక్షల మంది వెటర్నరీ సైన్స్ నిపుణుల అవసరం నెలకొంది. కానీ.. ప్రతి ఏటా సర్టిఫికెట్లతో బయటికి వస్తున్న వారి సంఖ్య 80వేలు దాటడంలేదు. దీన్నిబట్టి వెటర్నరీ రంగంలో వైద్య కోర్సులు పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశాలకు ఢోకాలేదని చెప్పొచ్చు. వెటర్నరీ సైన్స్, యానిమల్ హెల్త్‌కేర్ విభాగాలకు సంబంధించి వైద్యులు మొదలు.. రీసెర్చ్ నిపుణుల వరకు డిమాండ్ నెలకొంది. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎంఎస్) కోర్సు పూర్తిచేస్తే క్షేత్ర స్థాయిలో పశు వైద్యులుగా అవకాశం లభిస్తుంది. ఉన్నత విద్య పరంగా పీజీ, పీహెచ్‌డీ స్థాయిలో పలు స్పెషలైజేషన్స్‌లో చేరొచ్చు. తద్వారా యానియల్ హెల్త్‌కేర్‌కు సంబంధించి టీకాల తయారీ దిశగా కీలకమైన పరిశోధనలు సాగించే వీలుంది.
పరికరాల తయారీ సంస్థలు :వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్, పీజీ, పీహెచ్‌డీ స్థాయి కోర్సులు పూర్తిచేసిన అభ్యర్థులకు జంతువుల ఆరోగ్య సంబంధిత పరికరాల తయారీ సంస్థల్లో కొలువులు లభిస్తున్నాయి. జంతువులకు వచ్చే వ్యాధుల నిర్ధారణకు అవసరమైన ఎక్స్-రే వంటి పరికరాల తయారీ సంస్థలు, ఆపరేషన్ థియేటర్ పరికరాల ఉత్పత్తి సంస్థలు, డయాగ్నస్టిక్ ఎక్విప్‌మెంట్ తయారీ సంస్థలు ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి. వీటిలో కొలువులు సొంతం చేసుకున్న వారికి నెలకు రూ.50వేల నుంచి రూ.లక్ష వరకు వేతనం లభిస్తోంది. ఈ పరికరాల తయారీ విభాగంలో మెర్క్ అండ్ కో; జోయెటిస్, ఎలాంకో, మెరియల్ యానిమల్ హెల్త్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్నాయి.
లేబొరేటరీలు : ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు : అంతర్జాతీయంగానూ అవకాశాలు :వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీలో బ్యాచిలర్, పీజీ స్థాయి కోర్సుల ఉత్తీర్ణులకు అంతర్జాతీయ అవకాశాలకు కొదవలేదు. ప్రధానంగా యూకే, ఆస్ట్రేలియా, అమెరికాల్లో భారీ డిమాండ్ నెలకొంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం- ఈ దేశాలు జీవజాతుల సంరక్షణపై భారీగా వ్యయం చేస్తున్నాయి. ఆయా దేశాల్లో పెంపుడు జంతువుల సంస్కృతి ఎక్కువ. కాని అక్కడ డిమాండ్‌కు తగ్గట్టు పశువైద్యులు అందుబాటులో లేరు. కాబట్టి మన అభ్యర్థులు బ్రిటన్, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో అవకాశాలు అందుకునే వీలుంది. మన దేశంలో బీవీఎస్‌సీ అండ్ ఏహెచ్ చేసిన అభ్యర్థులు సదరు దేశాలు వేర్వేరుగా నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఉదాహరణకు.. రాయల్ కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సర్జన్స్ నిర్వహించే పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తేనే యూకేలో కొలువుకు అనుమతి లభిస్తుంది. అదే విధంగా యూఎస్‌లో అడుగు పెట్టాలంటే.. అమెరికన్ బోర్డ్ ఆఫ్ వెటర్నరీ ప్రాక్టీషనర్స్ సర్టిఫికేషన్ సొంతం చేసుకోవాలి. రీసెర్చ్‌లో అవకాశాలు విస్తృతం : స్వయం ఉపాధి :వెటర్నరీ సైన్స్ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు ఎక్కువే! సొంతంగా పెట్ కేర్ క్లినిక్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. నగరాలు, పట్టణాల్లో పెరుగుతున్న పెట్ యానిమల్స్ కల్చర్.. వెటర్నరీ రంగంలో స్వయం ఉపాధికి ప్రధానంగా మారుతోంది. ఇలా స్వయం ఉపాధి ద్వారా నెలకు కనీసం రూ.40 వేల వరకు ఆర్జించే అవకాశం ఉంది. బెస్ట్ స్పెషలైజేషన్స్ : వెటర్నరీ సైన్స్.. ముఖ్యాంశాలు :వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ, యానిమల్ హెల్త్‌కేర్ విభాగంలో రానున్న రెండేళ్లలో దాదాపు రెండు లక్షల మంది నిపుణుల అవసరం.
అకడమిక్ కోర్సులు : ప్రవేశం ఇలా.. ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు: తెలంగాణలో కళాశాలలు: డిప్లొమా కోర్సులు : గ్లోబల్ కెరీర్ ఖాయం : |