📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

లేపాక్షి – ఆలయాల నగరం

అనంతపూరు జిల్లాలో భాగమైన లేపాక్షి దక్షిణ భారత రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అందమైన ఒక  కుగ్రామం. కర్ణాటక లో ని బెంగుళూరు నుండి 120కిలోమీటర్ల దూరంలో అలాగే హిందూపూర్ నగరం నుండి 15 కిలో మీటర్ల దూరం లోఉంది. చిన్నదైనా, ఈ కుగ్రామంలో ఎన్నో చారిత్రాత్మక అలాగే ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగినవి ఎన్నో ఉన్నాయి.

దక్షిణ భారత దేశంలో  మహా శివుడు, మహావిష్ణువు, వీరభద్ర స్వామి ల కి అంకితమివ్వబడి, ప్రఖ్యాతి గాంచిన మూడు ఆలయాలు ఈ ప్రాంతం లో ఉన్నాయి. తాబేలు వెనుక భాగాన్ని పోలి ఉన్న ఆకారంలో ఉన్న ఒక చిన్న పర్వతానికి కూడా ఈ ప్రాంతం ప్రాముఖ్యత చెందింది. ఈ పర్వతం పైన  కూర్మ శైల. శ్రీరామ, రఘునాథ, వీరభద్ర, పాపనాథేస్వర ఇంకా దుర్గమ్మ వారి ఆలయాలు  ఉన్నాయి.
కఠినమైన ఆలయ రాతి గోడల పై చేక్కేందుకు నియమింపబడిన విశ్వబ్రాహ్మణుల కళా నైపుణ్యానికి నిదర్శనం ఇక్కడున్న ఆలయాలపై ప్రదర్శింపబడిన వారి పనితనం. ఈ ఆలయ ఆకృతి అలాగే నిర్మాణం శైలిలో ప్రఖ్యాతి గాంచిన విశ్వకర్మ శిల్పి అమర శిల్పి జక్కనచారి హస్తం ఉందని  చాలామంది నమ్మకం.
కాకోజు అలాగే మొరోజు అనబడే ఆ కాలపు పేరుగాంచిన శిల్పులు కూడా ఈ ఆలయ గోడలపై ఉన్న హస్త కళా నైపుణ్యానికి సహాయ పడ్డారని చెపుతారు. భారత పౌరాణిక గ్రంధాలైన రామాయణం, మహాభారతం వంటి ఇతిహాసాలనుంది  తీసుకోబడిన వివిధ ఘట్టాలను ఈ ఆలయ గోడలపై వర్ణించారు. ప్రసిద్ద మైన లేపాక్షి చీరల డిజైన్ లు కూడా ఈ ఆలయ గోడలపై ఉన్న చెక్కడాల ద్వారా ప్రభావితమయ్యాయన్నది ఆసక్తికరమైన అంశం.  వేలాడే స్థంభం, రాతి గొలుసు, వాస్తు పురుషుడు, పందెపు స్త్రీ వంటి ఎన్నో వివిధ ప్రత్యేకతలకి ఈ ఆలయం ప్రసిద్ది చెందినది. సహజ రంగులని ఉపయోగించి చిత్రీకరించిన అందమైన చిత్రలేఖనాలతో ఈ ఆలయ పై కప్పు అలంకరించబడినది.


ఈ ప్రాంతం లో ఉన్న ప్రధాన ఆకర్షణ వీరభద్రుని ఆలయం. దక్షిణ భారత దేశం నుండి ఏంతో మంది భక్తులు వీరభద్రుని దర్శనార్ధం ఇక్కడికి విచ్చేస్తూ  ఉంటారు. ఎండాకాలంలో విపరీతంగా ఎండలు ఉన్న సమయంలో తప్పించి ఏడాది పొడవునా ఇక్కడి వాతావరణం ఆహ్లాదకరంగా నే ఉంటుంది. విమానాశ్రయం, రైల్వే స్టేషన్ లేకపోవడం వలన లేపాక్షి కి చేరుకునేందుకు ఉత్తమమైన రవాణా రోడ్డు మార్గం. నిర్మాణ కళ మరియు రంగుల లోకం ఈ నగరం. చారిత్రాత్మక అంశాలపై పురాణ అంశాలపై ఆసక్తి కలిగిన వారిని ఈ ప్రాంతం అమితంగా ఆకర్షిస్తుంది.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading