📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

రాగులతో వడియాలు

కావలసినవి
బియ్యప్పిండి- రెండుకప్పులు
నీళ్లు- పన్నెండు గ్లాసులు
నూనె- ఐదుచెంచాలు
రాగి పిండి- కప్పు
ఉప్పు- నాలుగు చెంచాలు
అల్లం ముక్కలు- ఐదు చెంచాలు
నువ్వులు- రెండు చెంచాలు
జీలకర్ర- నాలుగు చెంచాలు
పచ్చిమిర్చి- ఆరు కాయలు మొత్తగా నూరుకోవాలి
తయారు చేసే విధానం
వేడి నీళ్లలో ఉండకట్టకుండా రాగిపిండిని బాగా కలిపి ఉంచుకోవాలి. తరువాత బియ్యప్పిండీలో నీళ్లు పోసిబాగా కలిపి పొయ్యిమీద పెట్టాలి. నీళ్లు మరుగుతుండగా నూనె వేసి, ఉప్పు, అల్లం తరుగు, మిర్చి ముద్ద, జీలకర్ర, నువ్వులు వేయాలి. కాసేపటికీ మళ్లీ పొంగుతుంది. కలిపి ఉంచుకున్న రాగి ఈ పిండి బాగా ఉడికి చిక్కగా అవుతున్నప్పుడు దింపేయాలి. కాస్త చల్లారాక వడియాలు పెట్టుకుంటే సరిపోతుంది.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading