📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

మైసూరు బోండాలు

కావలసినవి మైదా: కప్పు
బియ్యప్పిండి: పావుకప్పు
కొద్దిగా పుల్ల పెరుగు: కప్పు
ఉప్పు: రుచికి సరిపడా
అల్లంతురుము: టీస్పూను
జీలకర్ర: టీస్పూను
పచ్చిమిర్చితురుము: టీస్పూను
వంటసోడా: అరటీస్పూను
నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం
పెరుగులో తగినన్ని నీళ్లుపోసి బాగా కలపాలి. అందులోనే మైదా, బియ్యప్పిండి, సోడా వేసి మరీ జారుగానూ గట్టిగానూ కాకుండా కలపాలి. మిగిలినవన్నీ కూడా వేసి బాగా కలిపి ఓ గంట నానబెట్టి గుండ్రని బోండాల్లా కాగిన నూనెలో వేసి తీయాలి.
అల్లం చట్నీ, పొదీనా చట్నీ, కొబ్బరి చట్నీ వీటికి మంచి కాంబినేషన్.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading