Meenakshi Amman Temple/ Sundereswarar temple is one of the world’s most beautiful and magnificent wonder located in the temple city of Madurai, Tamil Nadu, India. The sculptures in this temple are very beautiful. The golden pond in the midst of the temple is an magnificent view to watch. The Thousand Pillar Hall of this temple is one of the great dravidian architecture which portrays the great works of ancient people.
Some of the interesting facts about the temple are:
1. More than 33,000 Sculptures on Gopurams
2. 14 Gopurams altogether in the majestic complex
3. Ozone layer and its preservation is depicted in the Paintings.
4. Inside the Garbagriha of the Temple, sound levels just don’t go above 40 decibels. (40 DB equals library ambience)
5. Spread over 14 acres, temple is one of the largest temples of Bharat.
6. A Thousand pillars built to perfection
7. The central hall inside ‘Pudhu Mandapam’ opens only during the ‘chitra festival.’
8. One of the largest Nandi.
9. The annual 10 day Tirukalyanam festival attracts over a million devotees
10. A massive Urdava Tandava Stone sculpture of Shiva Nataraja is present inside the Pudumadampam
11 No offerings are accepted by devatas if women are absent from the rituals.
“When you go to an Indian temple, it is just to behold an energy form. You want to take an imprint of Divine within yourself”
తెలుగు నాయక రాజులతో పునరుద్దరణ
శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్దార్ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలోనే పేర్కొన్నాడు. ఖిల్జీ సేనాని దురాక్రమణదారుడు మాలిక్ కపూర్ దీన్ని కూల్చి వేయించినట్లు చెప్తారు. ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి. 16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు. గోపురాలే ప్రధాన ఆకర్షణ
ఈ ఆలయం నలుదిక్కులా నాలుగు ఎత్తైన రాజగోపురాలతో గంభీరంగా గోచరిస్తుంది. సుందరపాండ్యన్, పరాక్రమ పాండ్యన్లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారని స్థల పురాణం. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. గుడి సంప్రదాయం ప్రకారం మొదట మీనాక్షీ అమ్మవారిని దర్శించుకోవాలి. కానీ ఇక్కడికి రావాలంటే తూర్పు వైపున ఉన్న అష్టలక్ష్మీ మంటపం ద్వారా ఆలయ ప్రవేశం చేయాలి. చూపరులను కట్టిపడేసే మరో అద్భుత నిర్మాణం స్వర్ణ కమల తటాకం. ఆలయ ప్రవేశ ద్వారంపై అమ్మవారి కల్యాణ ఘట్టాలు శిల్పాల రూపంలో చెక్కబడ్డాయి.
ముఖ్యమైన పండుగలు……..
మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. అమ్మవారి కల్యాణంలాగే అవని మూలోత్సవం ఇక్కడ ప్రధానంగా నిర్వహించే పండుగ. పదిరోజుల పాటు జరిగే ఈ ఉత్సవాన్ని సుందరేశ్వరుడికి అంకితం చేశారు. నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.
- ఈ గుడి లోపల అంతా తిరిగి చూచుటకు కనీసము 3 గంటలు పట్టును. ఇచట వెయ్యి స్తంభముల మండపము తప్పనిసరిగా చూడవలెను.
- తరువాత మీనాక్షి అమ్మవారి గుడి ఎదురుగా ఉన్న పుదు మండపము ఉన్నది. ఇచట అబ్బురపరిచే శిల్పములు ఉన్నవి. చుట్టూ ఇళ్లు, అంగడులు ఉండుట వలన ఇది ఎక్కువ ప్రసిద్ధి చెందలేదు, కానీ ఇది కూడా గొప్ప చోటు.
- తిరుమలై నాయక్కర్ మహాల్ – పూర్వము ఇది భవంతి, ఇప్పుడు ఇది సంగ్రహాలయము (మ్యూజియం).అబ్బురమైన నాయక్కర్ పాలకుల వాస్తు శిల్పకళ చూడవచ్చును. మండపము లో గొప్ప స్తంభములు ఉన్నవి.
- తిరుప్పరంకుండ్రం – మురుగన్ ఆరుపడైవీడు అనబడే కార్తికేయ స్వామి ఆరు నివాసములలో ఒక్కటయినది. మదురై పట్టనము నుండి 20 నిమిషములులో చేరుకోవచ్చును. గుడి ఉన్న కొండ దూరమునుండి చూచినచో అందముగా ఉండును.
- పళముదిర్ చోలై – కార్తికేయ స్వామి గుడి, అళగర్ మలై పర్వతపాదము లో ఉన్నది. అళగర్ కోవెలకు వెళ్లే దారిలో ఉన్నది.
- అళగర్ మలై కోవెల – విష్ణు స్వామి వారి గుడి. మదురై పట్టనము నుండి 21 కి.మీలో ఉన్నది.
- గాంధీ సంగ్రహాలయము / మ్యూజియం.
- ప్రొద్దున అల్పాహారము – వెన్న పొంగల్, ఇడ్లీ, మరియు వడా (గారె) కొఱకు మురుగన్ ఇడ్లీ కొట్టు.
- సంప్రదాయమైన తమిళనాడు భోజనము కొఱకు సరవన భవన్, అమ్మా మెస్, మీనాక్షి భవన్.
- సాయంత్ర అల్పాహారము – వడా, బజ్జి, కొఱకు వీధి ప్రక్కకు ఉండే కొట్లు.
- మదురై లో మాత్రము తప్పక త్రాగ వలసిన చల్లటి పానియము జిగర్తండా ఇది తమిళనాడు లో చాలా ప్రదేశములలో దొరుకును, కాని మదురై లోని ఫేమస్ జిగర్తండా కొట్టు లో మాత్రముయే సరియైన రుచిగా ఉండును.
తమిళనాడులోని మదురై నగరంలో ఆలయం ఉంది. దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి మదురైకు రైలు సౌకర్యం ఉంది. చెన్నై నుంచి ఏడు గంటల ప్రయాణం. చెన్నై, మదురై మధ్య వైగై సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ప్రతిరోజూ నడుస్తుంది.
విమానమార్గం : మదురై విమానాశ్రయానికి చెన్నై, తిరుచ్చి, బెంగళూరు, కోయంబత్తూరు నుంచి రోజూ విమాన సర్వీసులు ఉన్నాయి. మదురైకు దేశంలోని ప్రధాన ప్రాంతాలనుండి రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.
How to go : This tremendous architectural wonder is situated in Madurai (Tamilnadu).
from chennai : Bus route : 464 km
Trains : Chennai Egmore : 497 km
Official Website : www.maduraimeenakshi.org