📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

పెంటాస్ పూల మొక్కలు పెంపకం – జాగ్రత్తలు (Pentas flower plants)

చిన్నచిన్న నక్షత్రాలన్నీ గుదిగుచ్చినట్లుగా కనిపించే పూల మొక్కే పెంటాస్, ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో బహుళ ఛాయల్లో పూస్తాయిని. దీనికే స్టార్లర్లస్టర్, ఈజిప్టు స్టార్స్ అనే పేర్లూ ఉన్నాయి. అయితే, దీని శాస్త్రీయ నామం పెంటాన్ కార్నియా లేదా పెంటాస్ రాబ్సియేలేటా. పూలెంత ఆకట్టుకుంటాయో పచ్చటి ఆకులూ అంతే ప్రత్యేకంగా కనిపిస్తాయి.

ఎలాంటి నేలల్లోనైనా, వాతావర ణంలో నైనా సులభంగా పెరిగే మొక్క పెంటాస్, నేరుగా తగిలే సూర్యకాంతిలో చక్కగా పెరుగు తుంది. సరిగా ఎండ తగలక పోతే మాత్రం బూడిద తెగులు ఇబ్బంది పెడు తుంది. అయినా పూలు. బాగా రావాలంటే మాత్రం తగిన పోషణ అందించాలి. ఈ సమస్యను అరికట్టడానికి వంటసోడాను నీళ్లలో కలిపి చల్లితే ఫలితం ఉంటుంది. అలాగే వేప కషాయం కూడా. ముఖ్యంగా మట్టి సారవంతంగా ఉండేలా చూసుకోవాలి. అవుపేడు కుళ్లిన ఆకుల ఎరువు వంటివి తరచూ ఇవ్వాలి. లేదంటే 19:19: 10 చొప్పున ఎన్పీకే ఉండే సమగ్ర ఎరువును చల్లినా మంచిదే. దీనికి నీళ్లను పోసేటప్పుడు కేవలం మొక్క మొదళ్లకు తడి అందేలానే కాదు… ఆకులూ తడిచేలా చూసుకోవాలి. అయితే, ఎండిపోయిన పూలను ఎప్పటికప్పుడు తీసేయాలి. దీన్ని విత్తనాలతోనే కాదు… ముదురు కొమ్మల్ని కత్తిరించి నాటుకోవడం వల్లా కొత్తవి పెంచుకోవచ్చు. ఈ పూలకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు, హమ్మింగ్ బర్డ్స్ నూ ఆకర్షించే శక్తి ఉంది.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading