📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

పులికాట్ సరస్సు

pulicat lake

నెల్లూరు సమీపంలో ప్రసిద్ధి చెందిన పులికాట్ సరస్సు సహజసిద్ధంగా ఏర్పడిన ఉప్పునీటి సరస్సు. ఇది సుమారు 600 కి. మీ. ల విస్తీర్ణం లో వ్యాపించి ఉంది. నెల్లూరు జిల్లా వాకాడు,చిట్టమూరు, సూళ్లూరుపేట, దొరవారి సత్రం మరియు తమిళనాడు సరిహద్దులలో వ్యాపించి ఉన్నది. పక్షులకు ఆహారం పుష్కలంగా దొరకుతుంది. అక్టోబర్ నుండి మార్చిదాకా దేశ, విదేశాలనుండి షుమారు 50 లక్షల దాకా పక్షులు వస్తాయి. ఇక్కడ వాటర్ ఫౌల్, పెలికన్లు, హేరన్లు, ఫ్లమింగోలు వంటి పక్షులు తరచుగా కనపడతాయి. రాజస్థాన్ ఆఫ్ కచ్ నుండి ఫ్లెమింగో పక్షులు,సైబీరియా మరియు నైజీరియా నుండి గూడబాతులు (పెలికాన్) వస్తాయి. ఇవి నేలపట్టులో నివాసం ఏర్పరుచుకొని ఆహారం కోసం పులికాట్ కు వస్తాయి.
అరుదైన వలస పక్షి జాతులకు నిలయంగా వుంటుంది. ఒరిస్సా లోని చిలకా లేక్ తర్వాత ఇది రెండవ అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు. పులికాట్ సరస్సు పర్యాటకులకు చక్కటి పిక్నిక్ ప్రదేశం. ఈ ప్రదేశం పక్షి సందర్శకులకు కూడా ఎంతో ఆసక్తిని కలిగిస్తుంది. సంవత్సరంలో చాలా భాగం పక్షి సందర్శకులు ఇక్కడకు వస్తారు. పక్షులకు సంబంధించిని ఆడిటోరియం, గ్రంధాలయం, మ్యూజియం కూడా పులికాట్ లో ఉన్నయి. పక్షులకు చూడటానికి వాచ్ టవర్స్ ఉన్నాయి. లేక్ లో బోటు విహారం కూడా చేయవచ్చు. ఇక్కడి మత్స్య కారుల వద్దనుండి రూ.500 కు ఒక బోటు అద్దెకు తీసుకొని, సరస్సు అంతా చుట్టి రావచ్చు. పులికాట్ లో చేపలవేట వలన 10 వేల మంది మత్సకారులు జీవనం సాగిస్తున్నారు. పులికాట్ సరస్స మధ్యలో ఇరకటం అనే దీవి ఉన్నది. ఇది మంచి పిక్ నిక్ ప్రదేశం. ఇక్కడకు వెళ్లాలంటే భీమునివారి పాలెంనుండి పడవలలో వెళ్లవలసి ఉంటుంది.
ఎలా వెళ్లాలి ?
నెల్లూరు, సూళ్లూరుపేట, తిరుపతి నుండి బస్సులలో లేక సొంత వాహనాలలో వెళ్లవచ్చు. మద్రాసు నుండి 80 కిలోమీటర్ల దూరం.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading