📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

టిక్‌టాక్ పోయింది..’చింగారి’ వ‌చ్చేసింది

Chingari App  Desi Alternative To TikTok Crosses 1 Million Downloads  - Sakshi

తిండి తిన‌కుండా ఉంటాం కానీ టిక్‌టాక్ లేకుండా ఉండ‌లేం అంటున్నారు కొంద‌రు టిక్‌టాక్ యూజ‌ర్లు. అందుకే టిక్‌టాక్ స‌హా 59 చైనీస్ యాప్‌లను ప్ర‌భుత్వం నిషేదించ‌డంతో ముఖ్యంగా ప‌లువురు సెల‌బ్రిటీలు అయోమ‌యంలో ప‌డిపోయారు. ఇప్ప‌టికే ఈ యాప్‌ను భార‌త్‌లో దాదాపు 20 కోట్ల మంది వినియోగిస్తున్నారు. దీంతో ఉన్న‌ప‌లంగా తీసేయాలంటే ఇంకోటి రిప్లేస్‌ చేయాల్సిందే అనుకున్నారేమో వెంట‌నే టిక్‌టాక్ ప్ర‌త్యామ్నాయం ఏంటా అని శోధించారు. అదృష్ట‌వ‌శాత్తూ మ‌న భార‌తీయులు త‌యారు చేసిన ‘చింగారి’ యాప్ క‌ళ్లెదుట ప్ర‌త్య‌క్ష‌మయ్యింది. ఇంకేముంది గంటలోనే ఈ యాప్‌ను ల‌క్ష‌మంది దాకా డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

షార్ట్ వీడియో స‌ర్వీస్‌తో అచ్చం టిక్‌టాక్ మాదిరే ఉన్న ఈ యాప్‌పై ప్ర‌స్తుతం భార‌తీయులు మ‌క్కువ చూపిస్తున్నారు.  తెలుగు, ఇంగ్లీష్, హిందీ, బెంగాలీ,  గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళం భాష‌ల్లో ఈయాప్ అందుబాటులో ఉంది. దీంతో స్వ‌దేశీ ప‌రిఙ్ఞానంతో రూపొందింన ‘చింగారి’ యాప్‌ను ప్రోత్స‌హించాలంటూ ప‌లువురు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

బెంగుళూరుకు చెందిన బిస్వాత్మ నాయక్‌,  సిద్ధార్థ్ గౌతమ్ గ‌తేడాది చింగారి యాప్‌ను రూపొందించారు. అయితే మ‌నోళ్ల‌కు విదేశీ వ‌స్తువులు, యాప్‌లపై మోజెక్కువ కాబ‌ట్టి చింగారి యాప్ ఆద‌ర‌ణ‌కు నోచుకోలేదు. కానీ తాజాగా 59 చైనా యాప్‌ల‌పై ప్ర‌భుత్వం నిషేదం విధించ‌డంతో చింగారి యాప్ డౌన్‌లోడ్స్ పెరిగాయి. ఇప్ప‌టికే 1 మిలియ‌న్ మార్కును దాటేసి గూగుల్ ప్లే స్టోర్‌లో అగ్ర‌స్థానానికి చేరుకుంది. 

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading