📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

క్రిస్మస్ పండుగ (Christmas Festival)

క్రిస్మస్ ఒక ప్రముఖ ఆఘాతకర హిందూ పూర్వాగ్రహం లేకుండా, విభిన్న ధర్మాలు, వార్తా సంవాదం లేకుండా అనేక దేశాల్లో ఆఘాతకర ఆలయం అందించిన సంబరాలలో ఒకటి. ఈ పండుగ ఆసక్తి పొందిన వారందరికి అనేక ఆచరణలలో ఉంది. ఇది పాపులర్లో క్రిస్మస్ పండుగ లేదా క్రిస్టువుల పూర్వాగ్రహం అని పిలిచిన వెబ్ సైట్లు, వార్తాపత్రికలు మరియు సామాజిక మీడియాలో ప్రసారం అవుతోంది.

క్రిస్మస్ పండుగ క్రిస్తు జనులు క్రిస్తువు జనన దినంగా ఆచరించినది. ప్రస్తుతం, క్రిస్మస్ పండుగ డిసెంబరు 25న జరుగుతుంది. ఈ దినం అనేక దేశాల్లో ఆచరణలు, ఆలయాలు, పార్టీలు, సమారాధనలు, ప్రదర్శనలు, బేబీ క్రిస్మస్ ట్రీలు మరియు ప్రసాదాన్ని చేసే అంశాలు అనేకంటా ఉంటాయి. ఇది ఒక క్రైస్తవ పండుగ మరియు హిందూ, యెహూదీ, ముస్లిం, బుద్ధ, సిక్కు మరియు ఇతర ధర్మాలలో కూడా అందించిన అంశం కూడా ఉంటుంది. ఇంకా, క్రిస్మస్ కలిగిన నందు మానవాధికారాలను ప్రచోదిస్తుంది మరియు అది సాంస్కృతికంగా ప్రతిష్ఠితం ఉంటుంది.

క్రిస్మస్ అంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తయినా దేవుడు మానవుడు గా అరుదెంచిన మహా ఘట్టం, దైవ కుమారుడు యేసుక్రీస్తు(Jesus Christ)లోక రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన గొప్ప సంఘటన, పాపాత్ములైన మానవులను రక్షించుటకు పరిశుద్ధుడైన దేవుడు తనను తాను తగ్గించుకొని ఒక రిక్తుడిగా, ఏమి లేని నిరుపేదగా మానవుడిగా ఈ భూలోకానికి అరుదెంచాడు.ప్రతి సామాన్య మానవుడు ఆయనను సమీపించు రీతుగా అందరికి అందుబాటులో ఉండే విధంగా యేసుక్రీస్తు ధనవంతుని ఇంటిలో పుట్టలేదు కాని నిరు పేద నీతిమంతురాలు అయినా కన్య మరియకు పుట్టాడు. దేవుని పరిశుద్దాత్మ ద్వారా ఆమె గర్భం ధరించింది. ఒక పురుషుని ప్రమేయం లేకుండా కన్య అయినా మరియ గర్భం దాల్చింది. ఆమె ద్వారా యేసుక్రీస్తు ఈ లోకం లోకి ఉద్భవించాడు.మనుష్యులకు శాస్త్రానికి సాధ్యం కానివి దేవునికి సాధ్యం అవుతాయి, ఎందుకంటే దేవుడు ఏదైనా చేయగలడు కాని మానవుడు అతని పరిమిత స్థాయిని బట్టి చేయగలడు.

యేసుక్రీస్తు ఒక ఉచిత బహుమతి :దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను,దేవుని కృప, ప్రేమ ఎంతో గొప్పవి. చెడిపోయిన మానవులను ఆయన ప్రేమించడం ఏ స్వార్థం లేని పరమ తండ్రి ప్రేమకు నిదర్శనం, దేవుని కృప పొందుటకు మానవులు అపాత్రులు, కాని దేవుడు మనలను ప్రేమించి యేసుక్రీస్తు ను లోకమునకు పంపించేను.అందుకే తన ఏకైక కుమారుడైన ఒక్కడైనటువంటి యేసు క్రీస్తును ఈ లోకమునకు పంపించెను.యేసుక్రీస్తు దేవుడు మరియు అదే పక్షంలో ఆయన మానవుడు.మానవులను వారి పాపములను బట్టి శిక్షించుటకు క్రీస్తు రాలేదు కాని మానవ పాపములనుండి పాపపు శిక్ష (hell) నరకాగ్ని నుండి వారిని రక్షించుటకు వచ్చెను, దేవుడుండె స్థలంలో పరలోకము(heaven)లో మానవులను చేర్చుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చెను, పాపులను రక్షించుటకు యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను.మానవులు పొందబోయే దైవోగ్రత లేక నరకాగ్ని (hell) నుండి వారిని రక్షించుటకు, ఆ ధైవోగ్రత నరకాగ్ని (hell)ను యేసుక్రీస్తు ఆయన కలువరి సిలువలో భరించెను, తన భుజాలపై బరువైన సిలువను మోసాడంటే మానవ పాపాలను ఆయన తన భుజాలపై మోసాడు. ఆయన జన్మ లో పాపం లేనివాడు పరిశుద్ధుడు, జీవితం లో కూడా పవిత్రుడు పాపం లేనివాడు, కాని పాపులైన మానవ జాతి కొరకు తన పవిత్ర రక్తం కార్చాడు, ఆయన కార్చిన పవిత్ర రక్తం ద్వారా మానవ పాపములకు విమోచనం విడుదల దొరుకుతుంది, యేసుక్రీస్తు రక్తం ద్వారా పాప క్షమాపణ మానవులకు దొరుకుతుంది, ఎవరైతే క్రీస్తు కార్చిన ఆ పవిత్ర రక్తం యందు అనగా క్రీస్తు నందు విశ్వసిస్తారో వారందరు నరకమునుండి రక్షించబడి పరలోక వారసులవుదురు, యేసుక్రీస్తు మానవులకు ఒక గొప్ప బహుమతి, ఉచిత బహుమతి, ఏవరైనా సరే యేసుక్రీస్తు ను దేవుడిచ్చే ఉచిత బహుమతిగా తమ జీవితం లోకి రమ్మని పిలవవచ్చు, ఆయన ఇట్టే ఎవరి హృదయం లోకైనా వచ్చేస్తాడు, ప్రభువు ఎదుట మన నిజ పాప స్థితిని ఒప్పుకుంటే, క్షమించమని ప్రాధేయపడితే క్షమించుటకు ఆయన సిద్ద మనసు కలిగిన వాడు, క్షమించి మనలను పరిశుద్ధులుగా మార్చుతాడు, పశుద్దులుగా జీవించుటకు ఆయన పరిశుద్దాత్మను మనకిస్తాడు, పరిశుద్దాత్ముడు మనలను సర్వ సత్యం లోనికి నడిపిస్తాడు.యేసుక్రీస్తు మరణం నుండి సమాధి నుండి తిరిగి సజీవునిగా కనుపరచుకొని పరలోకమునకు ఆయన ఆరోహనమాయెను, ఎక్కడినుండి అయితే యేసుక్రీస్తు వచ్చాడో ఆ పరలోకమునకు ఆయన తిరిగి వెళ్లి తండ్రి కుడిపార్శమున సింహాషణమును అధిష్టించెను లేక కూర్చొనెను.

యేసుక్రీస్తు చీకటిలో వున్నవారికి నిజమైన వెలుగు, శాంతి లేని వారికి శాంతి, సమాధానం(peace )జీవితం లో నెమ్మది కలుగ జేయువాడు.మానవులకు నిజమైన సంతోషం, ఆనందం (joy)అనుగ్రహించువాడు ప్రభువైన క్రీస్తు. లోకమిచ్చునట్టుగా కాదు నా శాంతినే మీకు అనుగ్రహిస్తానని మాట ఇచ్చాడు,యేసు క్రీస్తు పసిబాలుడై వున్నప్పుడే తూర్పు జ్ఞానులు (wise men) సాగిలపడి నమస్కరించి పూజించి బాలుడైన క్రీస్తుకు మూడు విలువైన, ఖరీదైనా బహుమతులు సమర్పిస్తారు,అవి:

1)బంగారం(Gold ):బంగారం ప్రభువు రాజారికాన్ని(Kingship )తెలియజేస్తుంది ,యేసుక్రీస్తు అందరికి ప్రభువు, రాజు.బంగారం ప్రకాశిస్తుంది , మెరుస్తుంది, అలాగే యేసుక్రీస్తు దేవుని తేజస్సు, మహిమ కలిగినవాడు.

2)సాంబ్రాణి(Frankincense ):సాంబ్రాణి ప్రభువు దైవత్వాన్ని(Diety )తెలియజేస్తుంది.

3)భోళము(Myrrh ):ఆయన మానవత్వం(Humanity) ను తెలియజేస్తుంది.ఆయన మరణాన్ని, పునరుద్దానాన్ని(resurrection)ను తెలియజేస్తుంది.భోళము రెండు గుణములున్నవి, ఒకటి చేదు యేసుక్రీస్తు మరణాన్ని సూచిస్తుంది. రెండు మంచి పరిమళ సువాసన క్రీస్తు మరణం నుండి సమాధి నుండి లేచుటను తెలియజేస్తుంది.

తూర్పు జ్ఞానులు (wise men) నిజంగా గొప్ప జ్ఞానం కలిగిన వారు, వారు క్రీస్తును విశ్వాసించారు, క్రీస్తు నక్షత్రం బాలుడైన క్రీస్తు నొద్దకు నడిపించిది, వీరు ప్రస్తుత ఇరాన్ ప్రదేశం నుండి వచ్చినట్లుగా తెలుస్తుంది(800–900కి. మీ. ప్రయాణం చేసి భేత్లేహేము కు వచ్చారు.(వీరు క్రీస్తుకు ముందుగా ప్రవచింపబడిన బాలము ప్రవచనం :నక్షత్రం యాకోబు లో ఉదయించును. (బైబిల్ లో ఈ ప్రవచనం సంఖ్యా కాండం 24:17లో చూడవచ్చు ), మరియు దానియేలు ప్రవచనం ద్వారా కూడా ముందుగానే తెలుసుకొని క్రీస్తు ను ప్రభువుగా గుర్తించి ఆరాధించారు. ఈ ప్రవచనం (బైబిల్ లో దానియేలు 9:24–27 వచనాలలో చూడవచ్చు)

ముందుగానే ప్రవచింపబడిన రీతుగానే క్రీస్తు భేత్లేహేములో (Bethlehem )జన్మించాడు. దాదాపు క్రీస్తు పూర్వం 700 సంవత్సరాల క్రిందటే బైబిల్ లోని యెషయా గ్రంధం లో (యెషయా 7:14)కన్యక గర్భవతి అయ్యి కుమారుని కని అతనికి ఇమ్మానుయేల్ (Immanuel )అను పేరు పెట్టును.దేవుడు మనకు తోడుగా ఉండుటకు, మనలను రక్షించుటకు యేసుక్రీస్తు ఇమ్మానుయేల్(దేవుడు మనకు తోడు )గా ,లోక రక్షకుడుగా ఈ భూలోకమునకు అరుదెంచెను.ఇంకా అనేక ప్రవచనాలు యేసుక్రీస్తు ను గురించి ముందుగానే ప్రవచింపబడినవి, అందుకే బైబిల్ దేవుని సత్య గ్రంధం, అందులో ఎటువంటి సందేహం ఉండకూడదు.

గొర్రెలకాపరులు (shepherds):6.వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవదినములు నిండెను గనుక 7.తన తొలిచూలు కుమారుని కని, పొత్తిగుడ్డలతో చుట్టి, సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. 8.ఆ దేశములో కొందరు గొఱ్ఱెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా 9.ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి. 10.అయితే ఆ దూత భయపడకుడి; ఇదిగో ప్రజలందరికిని కలుగబోవు మహాసంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను; 11.దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి యున్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు(క్రీస్తు అను శబ్దమునకు అభిషిక్తుడని అర్థము) 12.దానికిదే మీకానవాలు; ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి యొక తొట్టిలో పండుకొనియుండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. 13.వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడనుండి 14.సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయన కిష్టులైన మనుష్యులకు భూమిమీద సమాధానమును(Peace)కలుగునుగాక అని దేవుని స్తోత్రము(praise )చేయుచుండెను.

దేవదూతలు(పరలోకమునకు చెందినవారు),తూర్పు దేశపు జ్ఞానులు(వేరే దేశము ఇరాన్ కు చెందిన వారు ,గొర్రెల కాపరులు(పామరులు ),ప్రవక్తలు(దైవ పండితులు, ప్రవచనములు తెలిసినవారు )(సూమియోను ప్రవక్త , అన్న ప్రవక్తి లూకా 2లో చూడవచ్చు )యేసుక్రీస్తు ను లోకరక్షకుడుగా, పాపవిమోచకుడుగా, దేవుడిగా గుర్తించారు.అంటే అన్ని రకముల గ్రూప్స్ చెందిన వారు క్రీస్తును ఆరాధించారు. అందుకే యేసుక్రీస్తు ఒక కులమునకు గాని, ఒక మతమునకు గాని, ఒక దేశమునకు గాని పరిమితుడు కాదు ఆయన సర్వవ్యాపి అన్ని దేశములలో ఆయన ఆరాదింపబడుచున్నాడు. అందుకే దేవ దూత బయపడకుడి, క్రిస్మస్ ప్రజలందరికి కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం తెలియజేయుచున్నానని చెపుతాడు.

18.యేసు క్రీస్తు జననవిధ మెట్లనగా, ఆయన తల్లియైన మరియ యోసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మవలన గర్భవతిగా ఉండెను. 19.ఆమె భర్తయైన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. 20.అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడవైన యోసేపూ, నీ భార్యయైన మరియను చేర్చు కొనుటకకు భయపడకుము, ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మవలన కలిగినది; ఆమె యొక కుమారుని కనును; 21.తన ప్రజలను వారి పాపములనుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు(యేసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము.) అను పేరు పెట్టుదువనెను. 22.ఇదిగో కన్యక గర్భవతియై కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు 23.అని ప్రభువు తన ప్రవక్తద్వారా పలికిన మాట నెరవేరు నట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. (బైబిల్ లో మత్తయి 1:18–25)

మీకు నిజమైన క్రిస్మస్ ఆనందం, సంతోషం, శాంతి, సమాధానం(peace )కలగాలని, మీకు కలుగు భయములనుండి ఆయన మిమ్ములను విడిపించాలని, మీ జీవితంలో అన్నిటికి యేసుక్రీస్తు గొప్ప మార్గమై యుండాలని, మీకు పరలోక భాగ్యం కలగాలని, నిత్యజీవమును (eternal life )ను పొందుకోవాలని అందరికి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయుచున్నాను. యేసుక్రీస్తు మిమ్మును ఆవిధంగా దీవించును గాక ఆమేన్.Happy Christmas…

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading