📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

క్యూఆర్ కోడ్ పాన్ కార్డు పొందండి ఇలా (PAN Card 2.0)

కేంద్ర ప్రభుత్వం పాన్ 2.0 ప్రాజెక్ట్ను ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించింది. ఇందులో ప్రధాన ఆకర్షణ క్యూఆర్ కోడ్ పాన్ కార్డు. ప్రస్తుత పాన్ కార్డుదారులు వీటిని ఎలా పొందాలనే సందేహం ఎక్కువ మంది నుంచి వస్తోంది. ఆన్లైన్లో చిరునామాను అప్డేట్ చేయడంతో క్యూఆర్ కోడ్ కలిగిన పాన్కార్డును పొందొచ్చు. ఆదాయపు పన్ను విభాగంతో నమోదైన పాత చిరునామాల స్థానంలో కొత్త చిరునామాలను పాన్ కార్డుదారులు ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని ఆదాయపు పన్ను విభాగం చెబుతోంది.

ఒకసారి ఆదాయపు పన్ను విభాగం రికార్డుల్లో చిరునామాను అప్డేట్ చేయగానే, క్యూఆర్ కోడ్ కలిగిన ఇ-పాన్ను పన్ను చెల్లింపుదారు నమోదిత ఇ-మెయిల్ ఐడీకి పంపుతారు. రూ.50 ఫీజు చెల్లించి పాన్ కార్డు ను ప్రింట్ చేసుకోవచ్చు. సాధారణంగా పాన్ కార్డు పై చిరునామా ఉండదు. దీంతో చాలా మంది చిరునామాలను అప్డేట్ చేయకుండా వదిలేస్తున్నారు. పాన్ కార్డు పై చిరునామా లేనప్పటికీ.. ఆదాయపు పన్ను రికార్డుల్లో ప్రస్తుత చిరునామాను ఇవ్వాల్సిందిగా నిపుణులు సిఫారసు చేస్తున్నారు. ఆర్థిక సంస్థలు, పన్ను వర్గాలతో సంప్రదింపులు చేయడానికి సరైన చిరునామా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ముఖ్యమైన సమాచారాన్ని సకాలంలో పొందడానికి, పాన్తో తాజా చిరునామాను అప్డేట్ చేస్తే మంచిదని అంటున్నారు.

ఆదాయపు పన్ను విభాగం ప్రకారం.. పాన్ కార్డుదారుడు తమ చిరునామాను ఉచితంగా మార్పు చేసుకోవచ్చు. ఆదాయపు పన్ను రికార్డుల్లో చిరునామాను అప్డేట్ చేసేందుకు, ఆధార్ నుంచి సమాచారాన్ని తీసుకుంటారు. ఆధార్తో పాన్ కార్డును అనుసంధానం చేసుకున్న వారు, ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవచ్చు. తద్వారా ఆధార్ ప్రకారం పాన్ డేటాబేస్ చిరునామాను మార్చుకోవచ్చు.

ఈ లింకుల ద్వారా చిరునామాను అప్డేట్ చేసుకోమని పన్ను విభాగం చెబుతోంది.

1) ఎన్ఎస్ఈఎల్ జారీ చేసిన పాన్ కలిగిన వారు https:///www.onlineservices. nsdl. com/paam/endUserAddressUpdate. html 2) యూటీఐ ఐటీఎస్ఎల్ జారీ చేసిన పాన్కార్డు కలిగినవారు https:///www.pan. utiitsl. com/PAN_ONLINE/homeaddresschange

  • పాన్కార్డులను జారీ చేసేందుకు ప్రోటీయన్ (ఇంతకు ముందు ఎన్ఎస్ఈఎల్), యూటీఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ అండ్ సర్వీసెస్ లిమిటెడ్ (యూటీఐఐటీఎస్ఎల్) సంస్థలకు ఆదాయపు పన్ను విభాగం అనుమతి ఇచ్చింది. పాన్కార్డు వెనుక కార్డు జారీ చేసిన సంస్థ పేరు ఉంటుంది.
  1. పైన చెప్పిన రెండు లింకుల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి.
  2. ఆ వెబ్పేజ్లో పాన్, ఆధార్తో పాటు పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాలి. ఆధార్ ఆధారిత అనుమతి కోసం బాక్స్లో టిక్ పెట్టి సబ్మిట్ చేయాలి.
  3. ఒక కొత్త వెబ్పేజ్ తెరపైన ఓపెన్ అవుతుంది. ఆధార్తో అనుసంధానమై ఉన్న మొబైల్, ఇ- మెయిల్ ఐడీకి వన్టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ఓటీపీతో ఆధార్ ఆధారిత ఇ-కేవైసీని జనరేట్ చేయొచ్చు. అనంతరం ‘కంటిన్యూ విత్ ఇ-కేవైసీ’ మీద క్లిక్ చేయాలి.
  4. మొబైల్/ఇ-మెయిల్ ఐడీకి వచ్చిన ఓటీపీని ఇచ్చి సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
  5. ఇక్కడ ఆదాయపు పన్ను రికార్డుల్లో ఉన్న మొబైల్ సంఖ్య, ఇ-మెయిల్ ఐడీని అప్డేట్ చేసే సదుపాయం కనిపిస్తుంది. మీరు మార్చుకోవాలనుకుంటే తాజా వివరాలను ఇవ్వాలి. మళ్లీ మీ మొబైల్/ఇమెయిల్కు వచ్చిన ఓటీపీ ద్వారా ఈ ప్రక్రియను పూర్తిచేయొచ్చు.
  6. ఆధార్లో ఉన్న చిరునామా వివరాలు అసంపూర్ణంగా కనిపిస్తాయి. వివరాలను సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత ‘వెరిఫై’ మీద క్లిక్ చేయాలి.
  7. ఒక కొత్త వెబ్పేజ్ తెరపైన ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ మీ కొత్త చిరునామాను ఇవ్వాలి. ఆ తర్వాత మీ కొత్త చిరునామా ఉచితంగా మారుతుంది.

Leave a Reply

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading