తూర్పుగోదావరి జిల్లాలోని ఈ నది గౌతమి నదియొక్క ఉపనది గౌతమి నది ఉపనది ఆత్రేయ నదికి ఉపనది. గుండ్లకమ్మ : ఈ నది కేవల వర్షాకాలంలోనే ప్రవహిస్తుంది. జన్మస్థానం తూర్పుకనుమలోని నల్లమల కొండలు. అర్ధవీడు, ప్రకాశం జిల్లాలలో నుండి ప్రవహిస్తుంది. కొండమీద నుండి వచ్చే అనేక కాలువలను కలుపుకొని కంబంలో ప్రవేసిస్తుంది. తరువాత మార్కాపురం మరియు కోరమండలం తీరం గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. నల్లమల పర్వతాలలో పుట్టే నదులలో గుండ్లకమ్మ పెద్ద నది. గజపతులు కాలంలో ఈ నదిమీద మట్టితో డామ్ నిర్మించబడినది. దీనినే కంబం డామ్ అని పిలుస్తారు.