కావలసిన పదార్ధాలు
బంగాళదుంపలు – 100 గ్రాములు
శనగపిండి – 100 గ్రాములు
నూనె – పావుకిలో
జీలకర్ర – ఆఫ్ టీస్పూన్
ఉప్పు – తగినంత
కారం – అర ీస్పూన్
తయారుచేయు విధానం
ముందుగా బంగాళదుంపలను తోక్కలపీలర్ తో తొక్కలు తీసేసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. బంగాళా దుంపలమీద ఆకుపచ్చ మచ్చలు గానీ, మొలకలు గానీ ఉండరాదు. ఇలాంటివి విషపూరితాలు. తరువాత గిన్నెలో శనగపిండి వేసి పిండి కలిసేటట్టు తగినంత నీరుపోసి మరీ గట్టిగా కాకుండా కొంచెం జరుడుగా కలుపుకోవాలి. జీలకర్ర, కారం, ఉప్పు వేసి కలపాలి. ఆ తరువాత పొయ్యిమిద బాణాలి పెటిట నూనె పోసి కాగిన తరువాత బంగాళదుంప ముక్కలను పిండిలో ముంచి నూనెలో వేసి వేయించాలి. దోరగా వేగిన తరువాత తీసి టిష్యూ పేపర్ మీద గానీ న్యూస్ పేపర్ మీదగానీ పరచాలి. ఎక్కువగా ఉన్న నూనె పీల్చుకొంటుంది.