📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Yanam Updates 14-02-2026

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌ల పంపిణీ

పుడుచ్చేరి ప్రభుత్వం విద్యార్థుల ప్రోత్సాహం కోసం ల్యాప్‌టాప్‌ల పంపిణీ కార్యక్రమాన్ని యానాంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఎంపీ ఎన్. రంగస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 2022–23 విద్యా సంవత్సరానికి చెందిన విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు పంపిణీ చేయగా, 2025–26 విద్యా సంవత్సరానికి సుమారు 7,450 మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించనున్నట్లు తెలిపారు. యానాంలో సుమారు 150 మంది విద్యార్థులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, అధికారులు, విద్యాశాఖ డైరెక్టర్ పాల్గొన్నారు.

18 నుంచి యానాం వెంకన్న కళ్యాణోత్సవాలు

యానాం ప్రబల ఆధ్యాత్మిక క్షేత్రమైన శ్రీ భువనేశ్వర వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో కళ్యాణోత్సవాలు ఫిబ్రవరి 18 నుంచి మార్చి 12 వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా అంకురార్పణ కార్యక్రమంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రతిరోజూ స్వామివారి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, ప్రసాదాల పంపిణీ జరుగుతాయి. ఫిబ్రవరి 18–26 వరకు ప్రత్యేక ఉత్సవాలు, 27న గరుడ వాహనోత్సవం, ధ్వజారోహణం, 28న స్నపనోత్సవం, మార్చి 1న స్వర్ణ వాహనం, 2న రథోత్సవం, 3న చక్ర తీర్థం, మార్చి 4–12 వరకు శ్రీ ప్రసన్నయాగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు భారీ సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు.

ఎస్సై పోస్టులకు 22న రాత పరీక్ష

యానాం: పుడుచ్చేరి పోలీస్ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్సై పోస్టులకు ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ శుక్రవారం తెలిపారు. పరీక్ష పుడుచ్చేరిలోని నాలుగు కేంద్రాల్లో జరుగుతుంది. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 0413-2233338 నంబరును సంప్రదించాలని అధికారులు తెలిపారు.

↑
Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading