📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

జీవితంలో అత్యంత విలువైన 10 విషయాలు

1.సమయం చాలా విలువైనది.

2.ఆరోగ్యం ధనం కంటే విలువైనది. విద్యా ధనం అన్ని ధనముల కంటే ముఖ్యమైనది.

3.సమాజం లో చాలా చెడు ఉంటుంది. కావున గుడ్డిగా అనుకరణ చేయకూడదు.

4.ధనమూలమిదం జగత్. డబ్బు లేని రోజున ఇంట్లో వారు దగ్గరి బంధువులు వేరే విధంగా ప్రవర్తిస్తారు.

5.ఏదైనా కష్టం వచ్చినపుడే మన అసలైన శ్రేయోభిలాషులు ఎవరో తెలుసు కుంటాము.

6.సంపదలున్నవని గర్వ పడకూడదు. అవి చాలా చంచల మైనవి. ఏ క్షణమైనా మనలను విడచి వెళ్లిపోవచ్చు.

7.వైద్యులు, వైదికులు, వకీళ్లు -వీరితో తగాదా పెట్టుకుంటే మనమే నష్టపోతాము.

8.తల్లి దండ్రులను, పెద్దలను గౌరవించడం మన బాధ్యత. మనము వారిని సరిగా గౌరవించక పోతే మన పిల్లలే మనకు ముసలితనం లో పెద్ద శిక్ష వేస్తారు.

9.మన బల హీనతలను ఎవరికీ చెప్పకూడదు.

10.మన మంచి అలవాట్లే మన నిజమైన స్నేహితులు. మన చెడు అలవాట్లే మన శత్రువులు. సంతృప్తి, మనస్ శాంతి తో జీవించే జీవితమే చాలా గొప్ప జీవితం.

Leave a Reply

Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading