📧 yanamtakshashila@gmail.com
Viswaguidance
☰ Menu

Yanam(India) Daily Updates 22-02-2026

చారిత్రక రద్దెరాజుల కాలంనాటి భూసమేత వెంకటేశ్వరస్వామి (మీసాల వెంకన్న) కళ్యాణోత్సవాల్లో భాగంగా మార్చి 2వ తేదీన నిర్వహించనున్న రథోత్సవం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. దీనిలో భాగంగా స్థానిక కొత్తబస్తాండులో ఉన్న రథాన్ని వందలాది మంది భక్తులు వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో సాంప్రదాయ చిన్యాసెంటర్‌కు తీసుకువచ్చారు. ప్రతి ఏడాది ఆనవాయితీగా చిన్యాసెంటర్ నుంచి కొత్తబస్తాండువరకు స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది. ఈ సందర్భంగా చిన్యాసెంటర్ వద్దకు తీసుకువచ్చిన రథానికి ఆర్ ఏ ఓ, ఐ ఎ స్ అధికారి అంకిత్ కుమార్ విశేష పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు నల్లా వెంకన్న, డీటీ జ్యోతులు వెంకటేశ్వరరావు, యర్రా జగన్నాథ రావు, అధికారులు పాల్గొన్నారు.

నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులను సమన్వయంగా చేపట్టాలని కోరుతూ శనివారం పుదుచ్చేరి సీఎం రంగస్వామి, ఎమ్మెల్యే కళ్యాణస్వామి తదితర ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేసి ప్రభుత్వ డిప్యూటీ ప్రతినిధి మల్లాది కృష్ణారావు తెలిపారు.మాట్లాడుతూ జీవీఎంసీలో కిడ్నీసంబంధిత రోగులకు ఉచితంగా మందులు ఇవ్వాలని, జీవీఎంసీ డైరెక్టర్‌ను కలిసి అనుమతి తీసుకున్నట్లు తెలిపారు. ఏప్రిల్‌లో సిటీస్కాన్ ప్రారంభం చేయాలని, ఎంఆర్‌ఐ యంత్రం యానాంలో పెట్టాలని, సిబ్బంది రిక్రూట్ చేయాలని కోరారు. అదేవిధంగా డైరెక్టర్‌ను కలిసి స్పెషల్ క్యాంపులను నిర్వహించాలని వాతావరణ, గృహ నిర్మాణ శాఖకు విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. అనంతరం ఎమ్మెల్యే కె. కళ్యాణస్వామిని కలిసి వినతులు సమర్పించారు.

 పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 46 మంది పోలీసు అధికారులకు బదిలీలు చేస్తూ ప్రభుత్వం కార్యాలయం సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఆర్. మోహన్‌కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. యానాం కోజల్ పోలీస్ స్టేషన్ ఎస్‌ఐగా ఎం. కుమార్, ట్రాఫిక్ పోలీస్ ఎస్‌ఐగా తిరునావుక్కరసును నియమిస్తూ ట్రాఫిక్ ఎస్‌ఐగా సేవలందిస్తున్న మోహన్‌కుమార్‌ను బదిలీ చేశారు.

పుదుచ్చేరి విద్యుత్ శాఖ గ్రామీణ ఉప దక్షిణ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా విధులు నిర్వహిస్తున్న లంక కృష్ణారావుకు కేబుల్ అండ్ టెలిటెల్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా ఉద్యోగోన్నతి లభించింది. ఈ మేరకు విద్యుత్ శాఖ అండర్ సెక్రటరీ కందన్ శివకుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. యానాం స్థానికులకు ఈ ఉద్యోగోన్నతి సందర్భంగా నేతలు, అధికారులు అభినందనలు తెలిపారు.

Scroll to Top

Discover more from Viswaguide

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading